పుట:Dvipada-basavapuraanamu.pdf/122

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ద్వితీయాశ్వాసము

63

నూనిన శివభక్తియుక్తి మార్గమున
వడి “దివారాత్రౌచ వర్జయే" త్తనఁగఁ
బడు సదాంతర్యోగభాతి గై కొలిపి,
ఘనబహిరంగ శృంగారాంతకంగ
వినుత ప్రమథన సంవిత్సుఖలీల
దివ్యానుభవవార్ధిఁ దేల్ప-నబ్బసవఁ
డవ్యయశివతత్త్వ మనువు నెఱింగి, 450
యుప్పుముల్లియ నీర నుంచినయట్లు
గప్పురంబున నగ్గిఁ గప్పినయట్లు
వడగళ్లవర్షంబు వారాశిఁ గురియు
వడుపునఁ దా లేక పర్తింపుచుండెఁ .
బ్రభువు చరిత్రంబు భక్తిమై భక్త
సభలందుఁ జదివిన సంప్రీతి విన్న
సరస సమంచిత సచ్చిదానంద
సురుచిరలింగైక్యసుఖము పట్రిల్లు,

—: వంగకాయలు లింగములైన కథ :—


వెండియు నొకనాఁడు దండనాయకుఁ డ
ఖండితభక్తివికస్వరలీల 460
జంగమార్చన సేయుసమయంబునందు
దొంగలు బందివెట్టంగ నూహించి,
'లింగవంతులు గాని [1]లెంగుల కతని
యంగణాంతరమున కరుగరా' దనుచు
వంగకాయలు గట్టుకొంగులఁ బొదివి,
లింగసన్నిహితులభంగి వట్రిల్లఁ
గని భయంపడి మ్రొక్క, గన్నుల నవ్వి
“లింగవంతులు గానిలెంగుల కీశ్వ
రాంగణంబున కెట్టు లరుదేర వచ్చు 470

  1. లెంగులు =నీచులు.