పుట:Dvipada-basavapuraanamu.pdf/115

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

56

బసవపురాణము

—: బసవని మేనల్లుఁడు చెన్నబసవని మహిమ :—


బరమేశుభక్తియ ప్రాణమై పరఁగు
తరుణి యానాగాంబవరతనూభవుఁడు, 250
ప్రస్తుతింపఁగ నొప్పుబసవకారుణ్య
హస్త సంభూత ప్రశస్తదేహుండు.
నసదృశభక్తియోగాత్ముండు చెన్న
బసవండు గురుభ క్తిపాత్రోత్తముండు :*
“బసవని శ్రీపాదబిసరుహంబులకు
నసలార నిత్యంబు నర్చ లిచ్చుచును
మించినభక్తిమై మేన రోమాంచ
కంచుకం బధికసమించితంబుగను
గద్గదకంఠుఁ డై కనుఁగవ నుఖస
ముద్గతాశ్రువు లొల్క నుత్సుకలీల 260
సప్రాణలింగలింగప్రాణమథన
సుప్రసన్నానుభవప్రాప్తిఁ బొంది,
నలిగొన [1]మర్కటన్యాయంబునందు
ఫలమునఁ బొంది సోపానంబులు డిగి
వెసఁ బొందఁగలుగు [2]వాయసఫలన్యాయ
మసలారఁగాఁ జరితార్థతఁ బొంది,
గురుభక్తి ఫలసారగుహ్యప్రసాద
వర సేవనా సుఖపరవశలీలఁ
గమనీయమొంద లింగంబు ప్రాణంబు
రమణఁ బ్రసాదపూరంబు దేహంబు 270
దిరమగుశుద్ధ భక్తియు మానసంబు
హరగణానుభవసౌఖ్యంబు ధనంబు
నిటు గూడ నన్నియు నేకమై కాదె

  1. బయటినిరోధ మెంతయున్నను సరకుకొనక కోఁతి తనకు దొరికిన వస్తువును గట్టిగా బట్టికొని విడువకుండుట.
  2. కాకి తనకు దొరికిన పండునందలి సారమును గ్రోలినవెంటనే దానిని విడిచి పెట్టుట.