పుట:Dvipada-basavapuraanamu.pdf/114

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ద్వితీయాశ్వాసము

55

పటుతరసద్భక్తపాదాబ్జరేణు
పటలపర్యంకంబుపైఁబొర్లి పొర్లి
హరభక్తనికరదయామృతవృష్టి
పరిగొని కురియఁ దొప్పఁగఁ దోఁగి తోఁగి.
[1] యొడయలదివ్యపాదోదరవార్థి
నడునీటఁ గడువేడ్కఁబడి తేలి తేలి .
వరభక్తసందోహపరితోషితార్ధ
పరమసపర్యసంపద వ్రాలివ్రాలి,
మతిలింగజంగమోచితపరతత్త్వ
సతత శివార్చనారతి సోలిసోలి, 230
శరణనిర్మలనిత్యసత్యప్రసాద
వరసేవనక్రీడ వడిఁ గ్రాలి క్రాలి,
చారువచోవిలాసంబులఁ దనర
నోరార వారి సన్కుతిసేసి చేసి , *
నియమవ్ర తాధిక నిష్ఠితాత్మకులఁ
బ్రియవస్తుసమితి నర్చించి యర్చించి,
బనవఁ డీక్రమమున భక్తి సామ్రాజ్య
మెసకంబుతోఁ జేయునెడ లసత్ప్రీతి
"ముప్పూఁట నోగిరంబులుఁ బదార్థములుఁ
దప్పక కావళ్ల నెప్పుడుఁ బంప 240
వెండి వేశ్యలయిండ్ల నుండి భోగించు
మిండజంగములు పండ్రెండువే లనిన
నున్నజంగమసంఖ్య మున్ను రూపించి
యేన్నంగ శక్యమే యీశున కైన?"
ననుచు భక్తానీక మచ్చెరువంద
ననయంబు భూతిశాసను లాదిగాఁగ
నెల్ల భక్తావళి కీప్సితార్థములు
సెల్లించును భక్తి సేయుచున్నెడను ;

  1. ఒడయలు = మాహేశ్వరులు.