పుట:Dvipada-basavapuraanamu.pdf/111

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

52

బసవపురాణము

పలుకట్ల నడవడిఁ బాలించు బాస,
తలఁ పెట్టు లట్టుల పలికెడుబాస,
పలికి బొంకనిబాస వొలివోనిబాస,
చల మెడపనిబాస సలిపెడిబాస, 140
తప్పఁ ద్రొక్కనిబాస దరలనిబాస,
యెప్పుడు భృత్యత్వ మెడపనిబాస ,
కలనైన శివునకు గెలు పీనిబాస,
గెలుపు భక్తుల కిచ్చి కీడ్పడుబాస,
పరసతిపై దృష్టి వఱపనిబాస,
పరధనంబుల కాసపడ కుండుబాస,
పరనింద నెయ్యెడఁ బొరయనిబాస,
పరమర్మకర్మముల్ పలుకనిబాస,
పరసమయంబులఁ బరిమార్చుబాస,
పరవాదులను బట్టి భంజించుబాస, 150
హరదూషణకుఁ జెవు లాననిబాస,
హరగణానర్పితం బంటనిబాస,
హరగణపరతంత్రుఁ డై యుండుబాస,
హరభక్తు లె ట్లన్న న ట్లను బాస,
జంగమంబును బ్రాణలింగ మన్బాస,
వెంగలిమనుజుల వేఁడనిబాస,
భవికి మ్రొక్కనిబాస భవి కీనిబాస,
భవబాధలకు నగపడకుండు బాస,
విషయేంద్రియములకు వె న్నీనిబాస,
విషమషడ్వర్గంబు విరియించుబాస, 160
వేదో క్తభక్తి సంపాదించుబాస,
యాది శివాచార మలరించుబాస.
శిర మట్టఁబాసిన శర ణనుబాస ,
శిరమున కట్టవాసిన మ్రొక్కుబాస,
ముట్టినచో వెన్క మెట్టనిబాస.