పుట:Dvipada-basavapuraanamu.pdf/107

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

48

బసవపురాణము

బసవనిఁ దోడ్తేరఁ బంచుఁడు. వారు
నెసకంబుతో సంగమేశ్వరం బేఁగి
యక్కడ బసవని ససమానుఁ గాంచి
చక్కఁ జాఁగిలి మ్రొక్కి. సరణి ని ట్లనిరి :
“నాకోపభోగాపునర్భవాదులును
నీ కొకలెక్కయే నిజ మట్లకాక ! 30
శివభక్తిసారానుభవభవ్యసుఖికి
నవశంబ కాక రుచ్యములె యిన్నియును ?
నైనను లోకహితార్థుండ వీపు
కాన మాప్రార్ధనఁ గైకొనవలయు :
బిజ్జలక్షోణీశు ప్రియము సల్పినను
నిజ్జగతీతలం బేలవే చెప్పమ !
మంత్రిపట్టమునకు , మండలంబునకుఁ,
దంత్రంబునకు , నిజాప్తమునకు, మూల
భండారమునకు భూపతిరాజ్యమునకు
నొండేమి నీవ కా కొడయ లున్నారె? 40
యతఁడు పట్టెఁడుకూటి కర్హుండ కాని
క్షితికెల్ల నీవచూ పతివి నిక్కంబు
విచ్చేయు" మని యిట్లు విన్నవించుడును
సచ్చోట భక్తహితార్థంబు దలఁచి
యందఱుఁ గొల్వంగ “నట్లకా” కనుచుఁ
గందర్పహరుభక్తగణముల నెల్లఁ
గొలిచి తత్కారుణ్యజలరాశిఁ దేలి
యలరుచుఁ జనుదేర-సంత నిక్కడను

—: బసవేశ్వరుఁడు కళ్యాణకటకము చేరుట :—


“నదెవచ్చె నిదె వచ్చె” నన విని ముదిత
హృదయుఁ డై బిజ్జలుఁ డెదురుకొ న్వేడ్క 50
నలవడఁ బదియురెండామడనేల
గలయఁగఁ గళ్యాణకటక మంతయును