పుట:Dvipada-basavapuraanamu.pdf/106

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ద్వితీయాశ్వాసము

శ్రీలింగమథనవిలోలకేలీవి
శాలసౌఖ్యానంద ! సంగయామాత్య !
అక్కడ నంతఁ గళ్యాణంబునందు
నెక్కుడు శివభ కి కెల్లయై పరఁగు
బండారి బలదేవదండనాయకుఁడు
దండి బసవనికిఁ దనయ నిచ్చుటయుఁ
బ్రమథు లెంతయు మెచ్చిరాఁ బంపఁబోవు
క్రమమునఁ బ్రమథలోకమున కేఁగుడును
బలదేవమంత్రియాప్తుల బంధుజనులఁ
బిలువంగఁ బంచి యాబిజ్జలుం డనియె : 10

—: బసవేశ్వరునకు బిజ్జలుఁడు దండనాయకపద మిచ్చుట :—


“ఇతని తోఁబుట్టువు సుతుఁ డెవ్వఁడేని
నీతనినియోగంబు ప్రతిదాల్పఁ గలఁడె ?"
అనవుడు “కలఁడు మహారాజ ! యతని
తనయ ప్రాణేశుండు వినయోక్తిపరు:డు ;
నీరాజ్యమంతయు నిలుపంగఁ గలఁడు ;
దూరీకృతాఘుండు దోర్బలాధికుఁడు
విను మఖిలకళాప్రవీణుఁ డె ట్లనిన :
జనులెల్ల నెఱుఁగఁగ సంగమేశ్వరుని
చేఁ బ్రసన్నత వడసెను గాన నీకుఁ
దాఁ బ్రధానిగఁ దగు ధరణీశ ! " యనిన 20
నిజ్జగం బింతయు నేలినకంటె
బిజ్జలుఁ డెంతయుఁ బ్రీతాత్ముఁ డగుచుఁ
దనవీటఁ దగినప్రధానుల హితులఁ
దనయెక్కు భద్రేభమును నమాత్యులను