పుట:Dvipada-basavapuraanamu.pdf/105

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

46

బసవపురాణము

జంగమలింగప్రసాదోపభోగ
సంగత సుఖసుధాశరధినిమగ్న
సుకృతాత్మ పాలకురికి సోమనాథ
సుకవి ప్రణీత మై శోభిల్లి తనరి
చరలింగ ఘన కరస్థలి విశ్వనాథ
వర కృపాంచితకవిత్వస్ఫూర్తిఁ బేర్చి
చను బసవపురాణ మనుకథయందు
ననుపమంబుగఁ బ్రథమాశ్వాస మయ్యె . 1268


____________