పుట:Dvipada-basavapuraanamu.pdf/104

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రథమాశ్వాసము

45

బాపురా ! మాయన్న ! బసవకుమార !
బాపురా ! మాతండ్రి ! భక్తివర్ధనుఁడ !
నల్లవో ! బసవన్న! నందీశమూర్తి!
నల్లవో ! బసవయ్య ! ముల్లోకవంద్య !
ఇ ట్టుండవలవదా పుట్టినఫలము
యెట్టును నున్నార మే మేమికొఱయుఁ ?
దనయు నొప్పించి వస్త్రము సమర్పించి
వనిత నియోగించి జనకునిఁ ద్రుంచి
పడసి రాద్యులు దొల్లి బసవఁ డి ట్లిప్పుడు
పడయునే శివుకృప బట్టకబయల" 1240
అని యెల్లవారును శంకింపుచుండ
ననురాగచిత్తుఁ డై యాబసవయ్య
కూడలి సంగయ్య గుడిమంటపమునఁ
గూడి భక్తావలి గొలు విచ్చియుండ
సారాంచితోక్తుల సంస్తుతింపుచును
బూరితంబుగ నాదపూజ సేయుచును
మూఁడుసంధ్యల గురుమూర్తిఁ గొల్చుచును
బోఁడిగాఁ బ్రొద్దులు పుచ్చుచునుండె,
బసవపురాణార్థపరిచయస్ఫీత !
బసవపురాణార్థపరిమళా ఘ్రాత ! 1250
బసవనామావళి పరమానురక్త !
బసవనామావళి పాఠకాసక్త !
బసవపాదాంభోజ పరిమళభృంగ !
బసవపాదాంభోజభరితోత్తమాంగ !
బసవకారుణ్యసౌభాగ్యైకపాత్ర !
బసవకారుణ్యసంపత్కళామాత్ర !
బసవసన్నిహిత సద్భక్తాత్మసఖ్య !
బసవసన్నిహిత సద్భావసంగాఖ్య !
ఇది యసంఖ్యాతమాహేశ్వర దివ్య
పదపద్మసౌరభ భ్రమరాయమాణ 1260