పుట:Dvipada-basavapuraanamu.pdf/103

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

44

బసవపురాణము

మెట్టిన, శర ణనుమీ బసవన్న :
యేఁ దప్పుపట్టుదు నిలఁ బరస్త్రీల
మీఁదఁ గన్నార్పకుమీ బసవన్న !
సాధ్యమౌ భక్తప్రసాదేతరం బ
మేధ్యంబకాఁ జూడుమీ బసవన్న !
నిక్కంపుభ క్తికి నిర్వంచకతయ
మిక్కిలి గుణము సుమీ బసవన్న !
ఏప్రొద్దు జంగమం బేనకాఁ జూడు
మీ, ప్రసాదముఁ గొనుమీ బసవన్న ! 1210
నాలుక కింపుగా శూలిభక్తులను
మేలకా నుతియింపుమీ బసవన్న :
యేమైన వలసిన యెడరైనఁ దలఁపు
మీ, మమ్ము మఱపకుమీ బసవన్న !
మోసపుచ్చు శివుండు బాస లేమఱకు
మీ, సత్య మెడపకుమీ బసవన్న !”
అని మృదునుధురాంచితాలాపములను
దనయుఁ బ్రబోధించి తాఁ గౌఁగిలించి
కొడుకుచే మ్రొక్కించుకొని గురుమూర్తి
గుడిఁ జొచ్చి తొంటికై వడిన యున్నెడను- 1220
నందఱు నతివిస్మయాక్రాంతు లగుచు
నిందుమౌళియ కాక యితఁడు మర్త్యుండె ?
యెన్నఁడే గుడికడ నీతపస్వీంద్రుఁ
గన్నవా రెవ్వరుఁ గల రయ్య : తొల్లి ;
బసవండు తన కెంత భక్తుఁడో కాక
యెసకంబుతో సంగమేశుండు దాస
వచ్చి తాపసిక్రియ మెచ్చి బోధించి
చొచ్చె నగ్గుడియ తా నెచ్చటో యణఁగె :
అతికృతకృత్యుల మౌదుమే యిట్లు
స్తుతియింపఁ గనుఁగొనఁ జొప్పడె నేఁడు ; 1230