పుట:Dvipada-basavapuraanamu.pdf/102

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రథమాశ్వాసము

43

నంతంత మఱియు సాష్టాంగుఁ డై మ్రొక్కి,
వింతవేడుక పెల్లివిరియ నగ్గురువు
చరణము లానందజలములఁ గడిగి
గురుపూజ తన్న కాఁ గూడ నర్పించి
పడియున్న, నతిదయాభావామృతంబు
కడకంటఁ గెడఁగూడఁ గొడుకు లేనేత్తి
యందంద కౌఁగిట నప్పళింపంగ
ముందట మ్రొక్కుచు మోడ్పుఁ గే లమర 1180
నెలకొన్న తత్స్వరనేత్రాంగవిక్రి
యలు భూషణంబు లై యాదట నున్న
బసవకుమారు సద్భక్తికి మెచ్చి
వెసఁ బ్రసాదం బప్పుడొసఁగి యి ట్లనియె :
“వచ్చినపోయినవారిచే నీదు
సచ్చరిత్రము విని సంతసిల్లుదుము ;
గతకాలవర్తనకంటె సద్భక్తి
మితిదప్పి నడవకుమీ బసవన్న !
శూలిభక్తాలి దుశ్శీలముల్ గన్న
మేలకాఁ గైకొనుమీ బసవన్న ! 1190
శత్రు లై నను లింగసహితు లై యున్న
మిత్రులకాఁ జూడుమీ బసవన్న :
పట్టినవ్రతములు ప్రాణంబుమీఁద
మెట్టిన విడువకుమీ బసవన్న !
వేఱెభక్తులజాతి వెదకకుండుటయె
మీఱినపథము సుమీ బసవన్న !
చిత్తజాంతకుభకిఁ జెడనాడుఖలుల
మిత్తి వీవై త్రుంపుమీ బసవన్న :
వేదశాస్త్రార్థసంపాదితభక్తి
మేదిని వెలయింపుమీ బసవన్న !1200
తిట్టిన, భక్తులు కొట్టినఁ, గాల