పుట:Dvipada-basavapuraanamu.pdf/100

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రథమాశ్వాసము

41

—: బసవేశ్వరుఁడు కప్పడిసంగమేశ్వరమున కేఁగుట :—


అంత భక్తాళికి నభిమతార్థములు
సంతుష్టిగాఁ బరిచర్య లొనర్చి
సాష్టాంగుఁడై భువిఁ జాఁగిలి మ్రొక్కి
శిష్టభక్తాళికిఁ జేతులు మొగిచి 1120
"యిల్లకప్పడిసంగమేశ్వరంబందఁ
దెల్లంబు మాగురుదేవుఁ డున్నాడు
చనియెద వారిశ్రీచరణముల్ గొలువఁ
గనియెద మిక్కిలి క రుణ మీచేత"
ననుచు సోదరియును నాలును దానుఁ
జనియె నాబలదేవుఁ డనుప వేగంబ ;
అప్పురి బసవఁ డల్లంతటఁ గాంచి
తప్పక గురుపదధ్యానాత్ముఁ డగుచు
గురు వున్నపురి దృష్టిగోచరం బైన
ధరఁ జాఁగి మ్రొక్కుచు నరిగె నంతంతఁ 1130
గన్నంత నుండి తాఁ జన్నంతదవ్వు
నెన్న యోజనమాత్ర మెసఁగి మ్రొక్కుచును
'గుదురు గదా మున్న గురుభక్తి శివున
కిది యెంతపెద్ద దా నితని గీర్తింపఁ
నని యెల్లవారలు నర్థిఁ గీర్తింప
జనఁ జొచ్చెఁ బురి గురు స్తవనంబుతోడ ;
నప్పురిమహిమ దా నది యెట్టి దనినఁ
జెప్పఁగ సలవియే శేషునకైనఁ?
బురియేఱులన్నియుఁ బుణ్యతీర్థములు :
పరగంగ గుహ లెల్ల హరునివాసములు : 1140
గిరు లన్నియును హేమగిరులు దలంపఁ ;
దరు లెల్ల దుద్రాక్షతరువులు గలయ
వనము లన్నియుఁ బుష్పవాటిక ; లచటి
గను లన్నియును భూతిగనులు దెల్పార