ఈ పుట అచ్చుదిద్దబడ్డది
46
ద్విపదభాగవతము
బలుకులు విందు రాభాగ్యంబు కతనఁ
దలఁచిన తలఁపులుఁ దలకూర్చె దైవ
మ”ని చెప్పుటయు విని యక్రూరుఁ డంత
వినయంబుచేఁగొని విదురుడుఁ దాను
అక్రూరుఁడు కుంభజాదులయిండ్లకుఁ జనుట
దుర్యోధనాదిపుత్రుల గుంభజాది
యార్యుల కర్ణాదులగు యోధవరుల
నాపగా [1]దాయాదులగు బంధుజనుల
నేపారఁగని వారియిండ్లకు నరిగి
కుతుకంబుతో నందు కొన్నాళ్లు నిలిచి
దృతరాష్ట్రు కడ కేఁగి తెంపును దగవు
[2]హితవును ధర్మంబు నేర్పడఁ బలికె
అక్రూరుఁడు ధృతరాష్ట్రునికి హితోక్తుల నుడువుట
“ధరణీశ! నీవును ధర్మచిత్తుఁడవు
భరతవంశాఢ్య! నీ ప్రతియవ్వ రెందు!
పాండుభూపతి నీకుఁ బరమభక్తుండు
దండివీరుఁడు నిన్ను ధరణి యేలించె500
నాతనిపుత్రుల కతిబలాఢ్యులకు
బైతృకంబగు రాజ్యభారంబుఁ బంచి
యిచ్చిన నీకుఁ బెంపెక్కు లోకములఁ
[3]బొచ్చంబుఁగల్గఁ బోవుదు వధోగతికి