పుట:Dvipada-Bagavathamu.pdf/79

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మధురకాండము

విరహాగ్నినెపమున వెలుపల మఱచి
పరమయోగధ్యానపరులచందమున
పరమానురక్తి హృత్పద్మంబులందు
చిరలీల నిలిచి భజింపుటఁ జేసి
మీతలంపులయందు మెలఁగుదుఁగాని
మీతో వియోగమేమియు లేదు మాకు
నిచ్చట పనిఁజూడ నెఱిఁగి మీకడకు
వచ్చెదననియె నవ్వసుదేవతనయుఁ"
డని చెప్ప, నుద్ధవాచార్యునిఁ జూచి
మనసిజోన్మాదులై మగువలిట్లనిరి.

గోపికలు శ్రీకృష్ణుని రూపును జేష్టలును వర్ణించుట


“నల్లని మే నున్నతమైన యురముఁ
దెల్లదమ్ముల మించు తెలిగన్నుగవయు
నెరిజడ చొళ్లెము నిటలరేఖయును
జిరునవ్వు మోమును జేత వేణువును400
నాయతబాహులు నధరంపుకెంపు
పాయక జిగిమించు పసిఁడిచేలయును
[1]దలఁబురిపెనపు కదంబమంజరియు
ధళధళ వెలుఁగెడు దంతదీధితియుఁ
గలరూపు మోమున గట్టినట్లుండ
తలఁచకుండిన నుండు తలఁచిన నుండు
[2]కలలందు మాతోడఁ గవయుచు నుండు
నెన్నడు వచ్చునో యిందిరావిభుఁడు

  1. తలబిరిపెనపు
  2. ఈపద్యపాద మొక్కటే కన్పడుచున్నది.