పుట:Dvipada-Bagavathamu.pdf/25

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

“నల్లని మే నున్నతమైన యురము
 దెల్లదమ్బుల మించు తెలి గన్నుగవయ
 నెరిజడ చొళ్లెము నిటల రేఖయును
 జిరునవ్వు మోమును జేత వేణువును
 పాయక జగిమించు పసిఁడి చేలయును
 దలఁబురిపెనవు కదంబ మంజరియు
 ధళధళ వెలిఁగెడు దంతధీధితియుఁ
 గలరూపు మోమున గట్టినట్లుండు.”

ఈ విధముగా వివిధమైన మనోహరవర్ణనలతోను, ఇంపును గూర్చు స్వభావోక్తులతోను, చక్కని తెనుఁగు నడకతోను, నాతి దీర్ఘములగు మధురమైన సమాసములతోను శ్రీకృష్ణుని చరిత్ర ద్విపదబద్ధముఁ గావించి మహాకవియగు మడికి సింగనార్యుఁడు భాగవత దశమస్కంధమును మాట్లాడు చలన చిత్రముభంగి పాఠకుల దృష్టిపథమునకుఁ బ్రదర్శించి ధన్యుఁడయ్యెను!

——:కొన్ని వ్యాకరణాంశములు :— -

  1. సంధి:— “పరిమార్చినతఁడు” “రుక్మిణిబ్బంగి” ఇత్యాది సంధిరూపములక్కడక్కడ కన్పడుచున్నవి. ఇట్టిసంధులు భాషలో విరణములు. మహాకవుల సమ్మతములే. “తామరసనేత్రలిండ్లు” “మా భక్తులొద్ద” “ఇతరులిండ్లు” ఇట్టి ప్రయోగము లనేకములున్నవి.
  2. “హరుషనిర్భర చిత్తుఁడై పలికె నతఁడు” ఇచ్చట “హర్ష” అను పదమును విడదీసి “హరుష” అని ప్రాసకొఱకు ప్రయోగింపఁ బడియున్నది.