పుట:Dvipada-Bagavathamu.pdf/24

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

కని శ్రీకృష్ణుఁడు బలరామునితోఁ గలసి కంసుని కొలువు కూటములో ప్రవేశించు సందర్భమున, శ్రీకృష్ణుని స్వరూపమును గుణగణములతోసహా పాఠకుల కంటిముందఱ నెంత మనోహరముగాఁ జిత్రించుచున్నాడో చూడుడు!

 
 “కరిమదరక్త పంకములచే మేన
 దొరగెడు ఘర్మ బిందువులును నరయ
 హరిమేను చిత్రవనాంబుద మనఁగ
 నరుదారఁ జూపట్టె నందంద చూడ;
 గజదంతములుఁ దాను కామపాలుండు
 భుజశిఖరంబులఁ బొలువందఁ దాల్చి
 దారుణతర దండధర్మయుగ్మమనఁగ
 గౌరత మల్లరంగము సొచ్చి నిలువఁ
 గోరి మల్లులకెల్ల కులిశమై, ప్రజకు
 ధారుణి నాథుఁడై, తల్లిదండ్రులకుఁ
 బసి బాలుఁడై యొప్పు, పంకజాక్షులకు
 నసమాస్త్రుఁడై, వల్లవాళికి నెల్లఁ
 బరమాప్తుఁడై, యతిప్రతతికి నెల్లఁ
 బరతత్త్వమూర్తియై, బంధు సంతతికి
 దైవమై, రౌహిణీతనయుఁడు దాను
 నావిష్ణుం డరుదెంచె నందఱుఁజూడ.”

శ్రీకృష్ణుని రూపును వర్ణించు కొన్ని ద్విపదలు చిత్రకారులకుంచెకు రసాయనమై ప్రోత్సాహమును గల్గించునదిగా నుండుట జూడుడు!