పుట:Dvipada-Bagavathamu.pdf/21

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

 నంతకంతకు నిన్ను నభిమతి సేయు
 విరహాగ్ని శిఖిఁ గ్రాఁగు వెలవెల నగుచు
 మరులెత్తినట్లు పల్మరు చిన్నఁబోవు
 నీభంగి నున్న యీ యిభరాజ గమనఁ
 బ్రాభవంబునఁ జైద్యపతి పెండ్లియాడ
 నెల్లుండి చనుదెంచు టెఱిఁగి యాయింతి
 యెల్ల విధంబుల నిది నీకుఁ జెప్పి
 పుత్తేర వచ్చితిఁ బుండరీకాక్ష!
 చిత్తంబులో నొండు చింతింప నేల
 ఆభామ నిజభార్యయై యుండునట్టి
 సౌభాగ్య మెవరికి సమకూరు? నీవు
 నారుక్మిణిబ్బంగి నాసలు సేయు
 కారుణ్యమూర్తివి కమలాక్ష! నిన్నుఁ
 గదసి నీదరహాస కౌముదిఁ గ్రోల
 ముదిత నేత్ర చకోరములు చేరఁగోరు
 నలవడి నీప్రయాణాంబువులోపఁ
 గలకంఠి చాతకి కడువేడ్క సేయు
 నీవెటులైనను నేచిన వేడ్క
 నావెలందుక నేలుటది నీకు నొప్పు;
 నిను నమ్మియుండిన నెలఁతుక నొకఁడు
 కొనిపోవగాఁ జూడఁగూడునే నీకు?”

మొదట శ్రీ రుక్మిణి యొక్క నామ వంశాదికమును జెప్పి యాదవాన్వయవంశమణియగు శ్రీకృష్ణుని వరించుటకుఁ దగిన యోగ్యతను నిరూపించెను. తరువాత దక్షిణనాయకుఁడైన శ్రీకృష్ణుని చిత్తము నాకర్షించుటకై యువజనాకర్షములైన తను