పుట:Dvipada-Bagavathamu.pdf/19

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

గీ॥ వ్యాస వాల్మీక శుక కాళిదాస బాణ
 హర్ష ణాదుల నాఢ్యుల నాత్మనిలిపి
 సకలభాషా రసజ్ఞుల సముల నన్న
 పార్య తిక్కన కవీంద్రుల నభినుతింతు.
 (వాసిష్ఠరామాయణము)

తెనుఁగు జాతీయ కవిత్వమును బాగుగాఁ బోషించి, దీర్ఘములగు సంస్కృత సమాసములను దొర్లించి విసువుఁ బుట్టించక భాగవత దశమస్కంధ రచన యింపుఁ గల్గించునదై యున్నదన్నచో సత్యదూరము కాదు. కవి స్వాభిమానము కలవాఁడు. తన శక్తిని బాగుగాఁ గుర్తెఱిఁగిన వాఁడు.

క॥ ఆపరమేశ్వర మకుట
 వ్యాపిత గంగాప్రవాహ కవితా స
 ల్లాపుఁడగు మడికి సింగనఁ
 జేపట్టక కీర్తిగలదె శ్రీమంతునకున్.
 (పద్మపురాణము)

కవి గొప్పభక్తుఁడు. వేదాంత శాస్త్రమందభిరుచి కలవాఁడు. కాఁబట్టి సాక్షాత్ లక్ష్మీదేవి యవతారమగు రుక్మిణిని వర్ణించు సందర్భమునందు స్తోత్రసాహిత్య ఫక్కీని పాదాదికేశాంత వర్ణన జేసి యున్నాఁడు.

ద్వి॥. “ఉచ్చిత పండ్లతో నుల్లసంబాడు
 నచ్చపలాక్షికి నంగుష్ఠచయము;
 పదనఖద్యుతుల నుపచరించు నెలవుఁ
 గదియ మౌక్తికములుఁ గట్టి నట్లుండు;