పుట:Dvipada-Bagavathamu.pdf/10

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

vi

ప్రాకటంబగు మధురాకాండమనిన
నాకల్ప మాకల్పమగు భంగిఁజెప్పె.”

భరద్వాజగోత్రసంజాతుఁడును, ఆరూఢమతి యయ్యలార్యనందనుఁడును నగు సింగయామాత్యుఁడు ఔబళమంత్రి కందామాత్యున కంకితముగా నీభాగవతదశమస్కంధమును రచించినట్లు స్పష్టము: మడికి సింగనామాత్యుఁడు రచించిన వాసిష్ఠరామాయణము యొక్క ప్రారంభమున నొక వచన భాగమును దిలకింపుడు.

“అని సకలజన సమ్మతంబుగా నుపక్రమించి భాగవత దశమస్కంధంబును దెనుంగున రచియించి యిచ్చి, అప్పుణ్యపురాణంబులకుఁ గృతిపతిగా నేపుణ్యునిఁ బ్రార్ధింతునో యని విచారించి, గజగంధవారణగంధ గోవాళ చలమర్తి గండగండరాయ గజశేఖరదొంతి మన్యవిభాళాది నానాబిరుదవిఖ్యాతులఁ బ్రసిద్ధుండగు రామగిరి పట్టణాధీశ్వరుండైన కుమారముప్ప భూపాలు మాన్యమంత్రి పదదురంధురుండగు నమ్మహారాజు దిగంతవ్యావృతకీర్తిలతాలవాలుండును, ధర్మచారిత్రుండును, నీతిచాతుర్య విశేషగుణగణాలంకారుండును, అనవరతదాన శీలుండును, అఖిల దిక్పరీతవిశాలుండును, వారణ వంశాబ్ధిసుధాకర కాశ్యపగోత్రపవిత్ర అబ్బనాచార్య తనూభవ కందనామాత్యుండు నాకు నతిస్నేహ బాంధవుండును నభీష్ట ఫలప్రదుండును నపూర్వవచనరచనానుబంధురకావ్య రసాభిజ్ఞుండును, అర్థిజన పారిజాతంబును గావున నమ్మంత్రి యుగంధరుం గృతిపతింగావించి, వెండియు కవిత్వత్త్వ రచనా కౌతుకంబున