పుట:Doddi Komurayya -2016.pdf/22

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ప్రపంచ చరిత్రలో

వివిధ తిరుగుబాట్లు - పోరాటాలు

అమెరికా స్వాతంత్ర్య పోరాటం: ఉత్తర అమెరికా అట్లాంటిక్‌ సముద్రతీరంలో పదమూడు ఇంగ్లీష్‌ కాలనీలు ఏర్పడ్డయ్‌. అమెరికాలోని ఈ పదమూడు వలస రాజ్యాలు దాదాపు 150సంవత్సరాలు తన మాతృదేశమైన ఇంగ్లండ్‌ పరిపాలనలో ఉన్నయి. వలసరాజ్యాలు తమ అనువతి లేనిదే ప్రత్యక్ష పన్నులు విధించటం, శాసనాలు అమలుచేయడం వంటి చర్యలు చేపట్టవద్దని ఎన్నోసార్లు విన్నవించినా వాళ్ళమొరను ఆలకించిన పాపాన పోలేదు. పైగా వలసరాజ్యాల ప్రజల మీద అనేక అంక్షలు విధించడం జరిగింది. 1764 స్టాంపుల చట్టాన్ని ప్రజలు పెద్దఎత్తున తిరస్మరించడం వల్ల బ్రిటీష్‌ ప్రభుత్వం 1766లో డిక్లరేటరీ చట్టం రూపొందించింది. దీనివల్ల “మాతృదేశానికి వలసలపై ఎప్పుడైనా పన్ను విధించే హక్కు ఉందని స్పష్టం చేసింది. ఇంగ్లండు నుంచి వలసలకు దిగుమతి అయ్యే గాజుసామాన్లు, సీసం, రంగులు, కాగితాలు, టీ వంటి సరుకుల మీద కొత్త పన్నులు విధించింది. పన్ను నిరాకరించిన వాళ్ళను కఠినంగ శిక్షించాలని ఆదేశాలు జారిచేసింది. ఈ విధమైన డిక్షరేటరీ చట్టాన్ని వలసప్రజలు తీవ్రంగ వ్యతిరేకించిండ్రు. జార్జి వాషింగ్‌టన్‌ నాయకత్వంలో వలస సైన్యాలు బ్రిటీష్‌ సైన్యాలకు ధీటుగ తిరుగుబాటు చేసిండ్రు. చివరికి ప్రపంచ వ్యాప్తంగ అనేక యుద్దాలతో అలసిపోయిన ఇంగ్లండు 1788లో అమెరికా వలస రాజ్యాలతో పారిస్‌ సంధి కుదుర్చుకుంది. తప్పనిసరి పరిస్థితుల్లో అమెరికా వలసరాజ్యాల స్వాతంత్ర్యాన్ని బ్రిటన్‌ అంగీకరించింది.

1789 ఫ్రెంచి విప్లవం: 1610లో నాల్గవ హెన్రీతో అధికారాన్ని చేజిక్కుంచుకున్న బూర్చన్‌ వంశరాజులు అత్యంత నిరంకుశులు. ప్రజాభిప్రాయానికి ప్రతిబింబంగ ఉండవలసిన ఎస్టేట్స్‌ జనరల్‌ (పార్లమెంట్‌) ని 1614 నుంచి దాదాపుగ 175 సంవత్సరాల వరకు ఏవిధమైన సమావేశాలు నిర్వహించలేదు. దీనివల్ల ప్రజల్లో తీవ్ర అసహనం నెలకొని ఉన్నది. ప్రజల్లోని అశాంతిని, అసంతృప్తిని రాజులు ఏనాడు గుర్తించిన సంధర్భం లేడు. రాజు, ప్రభువు, పూజారి వరాలు వర్సయిల్స్‌ రాజప్రసాదమే సమస్త ప్రపంచమని భావించి ఏనాడు దానిని వీడి బయటకు రాలేదు. ఇలాంటి అసమర్థ పాలన వలన గూడు కట్టిన ప్రమాదం16వ లూయి కాలంలో మహావిప్లవాన్ని సృష్టించింది.

22 * దొడ్డి కొమురయ్య