పుట:Doddi Komurayya -2016.pdf/16

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

నిజాం ఉల్‌ ముల్క్ - అసఫ్‌జాహీల పాలన

నిజాం ఉల్‌ ముల్క్‌ అసలు పేరు మీర్‌ ఖ(ముుద్దీన్‌ ఖాన్‌. ఈయన రాజనీతిని పరిపాలనా దక్షతను చూసి ఫతేజంగ్‌, నిజాం ఉల్‌ ముల్మ్‌అనే బిరుదులను ఇచ్చి దక్కన్‌ సుభేదారుగ నియమించిండ్రు. నాటి దక్మన్‌ సుభాలో కాందేశ్‌, బీరార్‌, తెలంగాణ, దౌలతాబాద్‌, అహ్మద్‌నగర్‌, ఆర్మాట్‌లతో కూడిన సువిశాల ప్రాంతం.

నిజాం తన స్వతంత్ర పాలనతో భాగంగ మొదట తెలంగాణ మీద ఆధిపత్యాన్ని సాధించిండు. తర్వాత తన రాజ్యాన్ని నలుదిక్కులకు విస్తరింపజేసిండు. నిజాం నిత్యం ప్రజల యోగక్షేమాలను గురించి ఆలోచించేటోడు. దక్కన్‌ సుభా రాజధాని బెరంగాబాద్‌లో కవి పండిత సభలు జరుగుతుండేవి.

నిజాం ఉల్‌ ముల్మ్‌ 1724 నుంచి 1748లో చనిపోయేంత వరకు దాదాపు 24 సంవత్సరాలు పరిపాలించిండు. ఉల్‌ ముల్మ్‌ మరణానంతరం ఇతని రెండవ కొడుకు నాజర్‌జంగ్‌ దక్కన్‌ సుబేదార్‌ అయ్యిండు.

నాజర్‌ జంగ్‌ (1748-1751): 1748 నుంచి 1751వరకు నాజర్‌ జంగ్‌ (మీర్‌ అహ్మద్‌ అలీఖాన్‌) పరిపాలించిండు. ఈయన కాలంలో ఆంగ్లేయులు, ఫ్రెంచి వాళ్ళు పాలనలో జోక్యం చేసుకొని ఏకంగ నిజాం మేనల్లుడైన ముజఫర్‌జంగ్‌ను దక్కన్‌ సుబేదార్‌గ ప్రకటించిండ్రు. ఆ వెంటనే ఆంగ్లేయులు నాజర్‌ జంగ్‌ను బలపరిచిండ్రు. కాని (ఫెంచి వాళ్ళు చేసిన కుట్రల వల్ల నాజర్‌జంగ్‌ హత్యకు గురయ్యిండు. హైద్రాబాద్‌లో అడుగు పెట్టక ముందే ముజఫర్‌జంగ్‌ కూడ హత్య చేయబడిండు. దీంతో నిజాం మూడవ కొడుకైన సలాబత్‌ జంగ్‌ ఫ్రెంచి వాళ్ళ సహకారంతో దక్కన్‌ సుబేదార్‌ అయ్యిండు.

సలాబత్‌ జంగ్‌ (1751-17638):1751 నుంచి 1768వరకు సలాబత్‌జంగ్‌ పాలించిండు. తనకు సహకరించిన ఫెంచివారికి కొండవీడు, నిజాంపట్నం, నర్ఫాపురం ప్రాంతాలను ఇచ్చేసిండు. తన అసమర్థ పాలనను చూసి నిజాం ఉల్‌ ముల్క్‌ నాల్గవ కొడుకు బ్రిటీష్‌వాళ్ళ సహకారంతో సింహాసనాన్ని అధిష్టించిండు.

నిజాం అలీ ఖాన్‌ (1768-1808): 1768 నుంచి 1808 వరకు గల నిజాం అలీఖాన్‌ పాలనకాలంలో నిజాం రాజ్యం మీద ఫ్రెంచి వారి పెత్తనం నశించి బ్రిటీష్‌ ఆధిపత్యం 16 * దొడ్డి కొమురయ్య