పుట:Doddi Komurayya -2016.pdf/12

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

దక్షిణ భారతదేశం- కుతుబ్‌షాహీల రాజ్యం

కుతుబ్‌షాహీల రాజ్య ఆవిర్భావం; చరిత్రలో మహ్మద్‌బిన్‌ తుగ్షక్‌ను గురించి తెలియనివారు ఉండరు. నిజానికి అతడు చాలా తెలివైనవాడు. కాని తన ఎత్తుగడలు ఏవి వలించకపోవడం వల్ల సర్వం కోల్పోయిండు. అన్తవ్యన్తమైన తుగ్గక్‌ పాలనాకాలంలోనే దక్షణ భారతదేశంలో ముస్లీం రాజ్యం ఏర్పడ్డది. అదే బహమనీ రాజ్యం. 1847లో ఇస్లాం సున్నీ తెగకు చెందిన అల్లావుద్దీన్‌ బహమన్‌షా ఈ రాజ్యాన్ని స్థాపించిండు. బహమనీ రాజ్యానికి మొదటి రాజధాని గుల్బర్గ, తదుపరి రాజధాని బీదర్‌. బహమనీ రాజ్యాన్ని మొత్తం పద్దెనిమిది మంది సుల్తాన్‌లు పరిపాలించిండ్రు. వీరందరిలో మూడవవాడైన మహ్మద్‌షా ప్రజల మన్ననలు పొంది గొప్పరాజుగ కీర్తించబడినాడు. అయితే ఈ బహమనీ రాజ్యం ఉన్నత స్థితికి చేరుకోవడానికి మహ్మద్‌గవాన్‌ కృషి ఎంతగానో ఉన్నది. 1481లో మహ్మద్‌ గవాన్‌ హత్యకు గురికావడం వల్ల బహమనీ రాజ్యపతనం ఆరంభమైందని చెప్పవచ్చు. క్రమంగా బహమనీ రాజ్యం ఐదు స్వతంత్ర రాజ్యాలుగ చీలిపోయింది. అవే బీరార్‌, బీదర్‌, బీజాపూర్‌, అహ్మద్‌నగర్‌, గోల్కొండ. బీరార్‌ని ఇమాద్‌షాహీలు, బీదర్‌ని బరీద్‌షాహీలు, బీజాపూర్‌ని ఆదిల్‌షాహీలు, అహ్మద్‌నగర్‌ని నైజాంషాహీలు, గోల్మొండని కుతుబ్‌షాహీలు కైవసం చేసుకొని పాలించిండ్రు. అయితే 1547లో బీరార్‌ అహ్మద్‌నగర్‌లోను, 1619లో బీదర్‌ వీజాపూర్‌లోను కలిసిపోయినయి.

1526లో అప్పటి వరకున్న ఢిల్లీ సల్తనత్‌ను అంతం చేసి బాబర్‌ మొఘల్‌ సామ్రాజ్యాన్ని స్థాపించిండు. ఈయన అసలు పేరు జహీరుద్దిన్‌ అహ్మద్‌. మొఘలుల పాలనా కాలంలో జమీందారీ వర్గం రైతుల నుంచి శిస్తు వసూలు చేసేవారు. ఆ శిస్తులో జమీందారులు కొంత భాగం తీసుకొని మిగతాది రాజులకు చెల్లించేవారు. వీళ్ళకు ఆరోజుల్లోనే గుర్రాలు, తుపాకులతో కూడిన చిన్న సైన్యం కూడ ఉండేది. మొఘల్‌ పాలనా కాలంలో జమీందారులు స్వంతంగ కూలీల చేత సాగు చేయించుకునే భూమినే “ఖుద్‌ఖాస్తో భూములని పిలిచేవారు. ఈ భూస్వాముల భూములను సాగుచేసే వాళ్ళను కౌలుదారులని అంటరు. మొఘల్‌ పాలకులలో మితిమీరిన రాజ్యకాంక్ష కలిగిన బెరంగజేబు1686లో బీజాపూర్‌ను, 1687లో గోల్కొండను మొఘల్‌ సామ్రాజ్యంలో వీలీనం చేసిండు. 12 * దొడ్డి కొమురయ్య