పుట:Dhruvopakhyanamu.djvu/5

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


నయనా" అనునది) విద్యారణ్యుల సోదరుడగు సాయణునిచే విరచితమగు నలంకారసుధానిధిలో నుదాహరింపబడినది. సాయణుడు 1380 లో దీని రచించినందున రసార్ణవసుధాకరాది కర్త సింగభూపతి 1360 లో నుండె ననుట యసంభవము కాదు. కొందరితడు శ్రీనాథ సమకాలికుడని భ్రమపడిరి కాని యది యసాధ్యమని తేలెగదా! కర్ణాటరాజులక్రింద నుండు కడపమండలవాసి శ్రీనాథాదులచే --- కీర్తి -- దేవరాయల విడిచి పరరాష్ట్ర ప్రభువగు సింగభూపతి నాశ్రయించె ననుట మహత్తరమగు కారణమున్నంగాని మనకు సమ్మతిపాత్రము కాదు. శ్రీనాథుడు బహుదేశ సంచారి. రాజులును రాజ్యములును జెడుచుండ దానును రాజ్యలక్ష్మివలె నూతనప్రియుల నాశ్రయించుచుండె. కేవలము భగవత్కైంకర్యము నభిలషించిన పోతన రాజపరంపర స్తుతించి జీవించెనా యను నచ్చెరువు కలుగుచున్నది. పై యంశముల గ్రోడీకరించి నిష్పక్షబుద్ధితో జూచిన నత డోరుగల్లువాసి యనియు భాగవతము రాజ్యవిప్లవముల క్షీణించెననియు నంగీకరింపదగు.

పోతన శ్రీధరస్వామి శిష్యుడని యోరుగంటి ప్రాంతమున బ్రతీతి గలదు. పోతన శ్రీధరవ్యాఖ్యాను మూలముతో జేర్చి తెనిగించె ననుట నిశ్చయము. శ్రీధరుడు. రాచగిరిప్రాంతపుయతి. భాగవతముకాక వీరభద్ర విజయము కూడ బోతన రచితమే. ముద్రిత గ్రంథమున నాల్గవ యాశ్వాసము పోతన కృతము కాదు.

ధ్రువోపాఖ్యాన భాగమున నొండు రెండు పద్యములు దక్క బోతన కవననైపుణి యెందును గానరాదు. అది గంగనాదుల కవితారచనయాయని తోచును. అయినను వెన్నెలకంటి సూరన రచించిన విష్ణుపురాణములోని ధ్రువోపాఖ్యానపు రచనకంటె నిది పెక్కు భంగుల గుణవత్తర మనుట నిస్సంశయము.


ప్రకాశకులు.