పుట:Dhruvopakhyanamu.djvu/4

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


ప్రాయశః నిర్దుష్టము. పూరించిన కవుల కవితలు నీరసములై దోషబహుళములై యుండుట నిస్సంశయము. దశమస్కంధమును మాత్రము మడికిసింగన్న ద్విపదరూపమున రచించె. అది పోతన గ్రంథమునకు శిథిలత్వ పూరణము కాదనిన్యు స్వతంత్ర రచనమనియు దోచుచున్నది. పూరించిన కవులలో నేర్చూరి సింగన, మడికి సింగనయు, నోరుగంటి కుత్తరమున రామగిరివాసులు ఏర్చూరి సింగన కువలయాశ్వ చరిత్ర కూడ రచించెను. బొప్పనాదులు త్రిభువనగిరి రాచగిరివారు షష్ఠైకాదశ ద్వాదశ స్కంథములు తెనిగించిన హరిభట్టు కంబముమెట్టవాసి. అన్య షష్ఠస్కంధకర్తలగు మల్లన సింగనలు బెజవాడ సమీపవాసులు దీని నూహింప భాగవత రచన నోరుగంటి చుట్టూ నేబది మైళ్ళదూరములో నిముడుచున్నది.

పై యంశము లాలోచింప బమ్మెర పోతన యోరుగంటిలో నుండెనని తోచకమానదు. గ్రంథము శిథిలమగుటకు గారణము సులభగోచరమగును. 1420 ప్రాంతమున గడపమండలము విద్యానగరరాజగు దేవరాయని పాలనముననుండెను, అతని మంత్రు లాంధ్రులు. పెక్కండ్రాంధ్రభాషలో గ్రంథరచన జేయించిరి. వారి రాజ్యములో భాగవతము వంటి గ్రంథము నశించుటకు వీలుండదు. పోతన ఏకశిలా నగరవాసి యని భాగవతములో జెప్పుకొనెను. నగరశబ్దము సాథారణముగా రాజధనికి నామము కార్వేటి కగరాదు లపవాదకోటిలో జేరును. ఏకశిలానగర మనుపేరు సుప్రసిద్ధముగా నోరుగంటికి బేరు. బమ్మెర గ్రామము తత్సమీపమున నున్నది. ఇప్పుడింటి పేరొకచోట వాసము మరియొకచోట దరచైనను బూర్వకాలమున నంత తరచుగా నుండదని మామతము. పోతన గ్రంథము సర్వజ్ఞసింగభూపాలుడు కోరె ననుటయు బోతన రచించిన భోగినీ దండక తద్వేశ్యాప్రశస్తికమనుటయు సింగభూపాలుడు రాచగిరిలో రాజ్యము చేసినవాడనుటయు బోతన తత్సమీప ప్రదేశవాఇ యను నంశము స్థిరీకరించుచున్నది. రసార్ణవసుధాకరచమత్కారచంద్రికాది గ్రంథముల రచించిన లేక రచింపించిన సింగభూపాలుడు శ్రీనాథుని కంట్ జాల బ్రాచీనుడని స్పష్టమైనది. చమత్కారచంద్రికలోని చక్రబంధశ్లోకము (నక్ష్మాచక్రదిశావిలాసి