పుట:Dhanurvidyaa vilaasamu (1950).pdf/72

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

6 కృత్యవతరణిక


చామరద్వంద్వమును జగజంపుగొడుగు
పంచఘంటాతలాటంబు భద్రగజము.

21


వ.

వెండియు.

22


శా.

ఆజానేయము రత్నకుండలయుగం బాందోళికారత్నముం
బ్రాజాపత్యము ముర్తుజాన్నగరసామ్రాజ్యంపుమన్నెర్కమున్
రాజామానికరా వటంచు నభిధానం బిచ్చినం బ్రీతుఁడై
భ్రాజిష్ణుం డగుచున్ దగున్ గుతుపశాపాచ్ఛాసమక్షంబుగన్.

23


వ.

ఇ ట్లమ్మహీమండలాఖండలుండు కుతుపశానుగ్రహంబున నేనూ
టయెనుబది నాల్గు [1](వక)వరగ్రామంబులం బ్రసిద్ధంబగు ముర్తుజాన్న
గరంబునకుం దావలంబైన రాజ్యంబునకు మన్నెఱికంబును
దక్కుంగల సన్మానంబులుం బడసి యప్పాదుశాపనుపున ముర్తు
జాన్నగరంబు ప్రవేశించె నమ్మహారాజధాని వసుంధరాభరణంబై
ప్రవర్ధిల్లుచుండు.

24


సీ.

పసమించు భీష్మకప్రముఖావనీపాల
        కులకు వజ్రపుజోడు కొండవీడు,
శత్రురాజాధిరాజవిరాజదైశ్వర్య
        [2]కుదిరంబు ముకుద్రాడు కొండవీడు,
అఖిలయాచకరాజహంసయూధములకు
        క్రొందామరలకాడు కొండవీడు
దేవతాయత[3]నమై దీపించు కల్యాణ
        కుధరంబు సైదోడు కొండవీడు,


తే.

హరిహరవిరించిముఖదేవతావతంస
సంపదభిరామహేమవిశాల సాల
జాగ్రదగ్రముహుర్ముహుశ్చటుల పటహ
ఘుమఘుమధ్వానములగూడు కొండవీడు.

25
  1. వక
  2. కుళకంబు
  3. యతనైక