పుట:Dhanurvidyaa vilaasamu (1950).pdf/62

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తూర్పుగాఉండును. (16) ఈ కొండకుదగ్గర జద్దిగాల బావి దీనికి దగ్గరగా రెడ్డివారి చెరువుగలదు. (17) పెదదాసరాయ, చినదాసరాయ తోట లున్నవి. (18) ఈ గ్రామానికి దక్షిణంగా స్వయంభువు అయిన కొండ శింగరయ్య అనే నృసింహస్వామి బిలంలో ఉన్నాడు. (19) ఈ స్థలానికి ఉత్తరం తిరుమల లక్ష్మీనృసింహ ఆలయమున్నది. (20) గ్రామమున పశ్చిమం శ్రీరామేశ్వరస్వామివారి దేవాలయం ఉన్నది. (21) దీనికి దగ్గర రుక్మిణీ సత్యభామా సమేత గోపాలస్వామి దేవాలయం (22) దీనికి పశ్చిమంగా సీతాపతి అనేచెరువున్నది. (23) ఈ గ్రామానికి ఉత్తరం వీరభద్రస్వామివారు, (24) దీనికి ఉత్తరంగా రెడ్లు కట్టించిన దేవస్థానము లున్నవి. పెద్ద దర్వాజా ఉన్నది. (25) దీనికి ఉత్తరం పత్తేఖాను మశీదు ఉన్నది. (26) దీనికి ఉత్తరం .... అనే అత్తారు మశీదు ఉన్నది. (27) దీనికి ఉత్తరం పాడుబడ్డ మశీదు. (28) ఈ గ్రామాణికి పశ్చిమం పేట మహమ్మదాపురం. (39) దీనికి దక్షిణం నల్లమశీదు. (30) దీనికి పడమట గుమ్మల్ మశీదు. (31) దక్షిణ జామత్ కానా మశీదు. (32) చిన్న మశీదు (38) దక్షిణమున రెండుదర్వాజా లున్నవి. (34) దీనికి దక్షిణం కొండవీటి గోపీనాథస్వామి పట్టణం అనే మర్త్యుజానగరు. దీనికి ఉతరపువైపు కొండపల్లి దర్వాజా ఉన్నది. (35) దీనికి దక్షిణ గోపీనాథపట్నంలో నాదొడ్లదర్వాజాలు. (36) కుదుబ్ షాపేట. శ్రీవెన్ముద్ద కృష్ణస్వామి దేవాలయము గలదు. (37) కమాల్ దీన్ వారి మశీదు ఉన్నది.

గ్రంథార్థము

ఈ గ్రంథమునఁ బ్రధానముగా ధనుర్నిర్మాణము మొదల్కొని శరప్రయోగాంతముగాఁ గల ధనుశ్శాస్త్రవిషయయములు, అనుభవరూఢకములు ససిగా వివరింపఁబడినవి. కాని యీ గ్రంథమునకంటెఁ దునిరాజాగారు ప్రకటించిన ధనుశ్శాస్త్రము విపులమయినది. విషయవిశేషములు గలది. సంస్కృతధనుశ్శాస్త్రగ్రంథము లన్నింటను విషయసామ్య మున్నది. వాని ననుసరించియే యీ రెండు తెల్గుగ్రంథములు వెలసినవి. కాని యీయిర్వురుగూడ సంస్క్రతమూలగ్రంథముల