పుట:Dhanurvidyaa vilaasamu (1950).pdf/61

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తాలూక జమీందార్ల పరంచేసిరి. అప్పుడు యీ ఓంటుకు మానూరి నరసన్నకు ఒప్పగింపబడెను. ఆయన 1219 వరకు 20 సం॥ పాలించి వీరి తమ్ముని కుమారులు వెంకటకృష్ణునింగారు 1221వరకు పాలించెను.

(1) భీష్మకునినగరం కుండిననగరంపట్టున పోలయవేమారెడ్డి మరల పట్టణం కట్టించెను (2) దీనికి ఉత్తరం పుట్టకోట కట్టించిరి. (3) ఈగ్రామానికి ఉత్తరదార్వాజాకు పశ్చిమంగా శివాలయం పడిపోయినది. (4) ఈదేవాలయానికి తూర్పు లంకెలబావి ఉన్నది. (5) ఈ బావికి తూర్పున కైలాసరాయనికొండ ఉన్నది. 108 దేవాలయాలను రెడ్లు పూజించేవి మ్లేచ్ఛులు పాడుచేసిరి (6) ఈ స్థలానికి ఉత్తరం బార్ల ఆవీడు దేవాలయం దానికి క్రిందుగా బ్రహ్మగుండం కోనేరు ఉన్నది. (7) పట్నానికి ఆగ్నేయముగా వేంక టేశ్వరస్వామి - యీస్వామికి తూర్పు పుష్కరిణిఉన్నది. (8) ఈ స్వామికి ఆగ్నేయంగా కన్యకలబావి (9) ఈ పట్నానికి దక్షిణంగా గోపినాథస్వామి దేవాలయం ఈ ఆలయానికి పశ్చిమంగా రంగనాథస్వామివారిని గజపతివారు ప్రతిష్టించిరి. (11) నాగమయ్య దక్షిణముగా కో నేరు ఉన్నది. (12) ఈ కోనేరుకు దక్షిణంగా మాణిక్యారావువారి కోనేరుకలదు, పూర్వం కర్ణాటక ప్రభుత్వంలో యీ వెలుమవారు గోపీనాథపట్నం తురకలదని యిక్కడ రాజగృహములు కట్టించుకొని నివసించుతూ ఈ కోనేరు త్రవ్వించిరి. (18) ఈ కోనేటికి తూర్పుఁగా మాణిక్యారావు గుండాలని రెండుదద్దణాలున్నవి. పూర్వము యుద్ధాలలో మగవారు చనిపోతే స్త్రీలు సహగమనం చేసినారు యీగుండాలలో అని ప్రసిద్ధి. (14) ఈ గుండాలకు దక్షిణంగా రెడ్లు కట్టించిన పెద్దకోనేరు ఉన్నది. (15) ఈ కోనేటికి పశ్చిమమున గృహరాజ మేడదిబ్బ ఉన్నది. రెడ్లప్రభుత్వంలో కోమటి వేమారెడ్డిగారు శ్రీనాథుని ప్రభావంవల్ల నవులూరిపోతరాజు దేవాలయం వద్దనున్ను యేడుతాళ్లపొడుగు యేడుమోకులుతిరిగే లావును గల తుమ్మచెట్టును తెప్పించి ఒంటిస్తంభము మేడ కట్టించి ఆదిలక్ష్మి కామేశ్వరి అమ్మవారికి సింహాసనముగ ప్రతిష్టించిరి. ఈ మేడ శిఖరానను బొల్లిమోర వేంకటేశ్వరస్వామివారి దేవాలయమునకు మకరతోరణం కట్టించిరి. ఇక్కడకు వెంకటేశ్వరస్వామివారి కొండ