పుట:Dhanurvidyaa vilaasamu (1950).pdf/59

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కొండవీటి జిల్లాలో హుజూరునాయకుడు ఖిల్లాదారు హోదాలో యున్న మాణ్యిక్యారావు స్వదేశిముఖి అనిన్నీ, మాసూరు వారికి మజుందారనిన్నీ, పాత్రునివారికి దేశపాండ్యగిరిన్నీ సదరు సమతులను స్వాధీనపరచి నాదెళ్ల సమతుకు కమ్మవారిని నియమించి వారి పరంగా మామ్లియతు జరిగేటట్లుగా నిర్ణయించినారు. తరువాత మహమదు పాదుషాహి రాయలంగారు గోల్కొండను రాజ్యంచేయుచు బందిపోట్లను అడచుటకై అమీనుముల్కును కొండవీటికి బంపగా అతను బందిపోటును అణచి 1514లో ముల్లగూరి అగ్రహారమును పాడు చేసి తన పేర మల్కాచెర్వు, మల్కామాహాలు, మల్కాబావి కట్టించి ముల్లగూరిని యాబలూరి గ్రామంలో కల్పి అమీనుబాదా అను పేరు పెట్టి దుర్గం కట్టించిరి. ఒక బురుజు పేరు మల్కాబురుజని పేరు పెట్టి హిందువుల కట్టడముల పాడొనరించి 1512 నుంచి 1520 వరకు 7 సం॥ పరిపాలించెను. కాలమందు సిగిలిన్ ఖాను ఈ పురమువచ్చి మహమ్మదు కుదుబ్ షావారి ఈ పురమునకు దక్షిణమున పేట, పురము కట్టించెను. తరువాత అబ్దుల్లా సుల్తాను, అబ్దుల్లాహుస్సేను, తానీషా అలంగీరు, పాదుషాలు రాజ్యము చేసిరి. వారి దినములలో అధికారము చేసిన హమీళ్ళు చితాపఖానుడు 1521 నుంచి 1524వరకు, 1524నుంచి ఒక సం॥ అబినిసిద్ధి చివులు ఖానుడు 1524నుంచి 1527వరకు అప్పరస ఖానుడు ప్రభుత్వం చేసిరి. వీరి తర్వాత యల్లాస్ ఖానుడు గుంటుపల్లి ముత్తురాజయ్యలు పరిపాలించి. తరువాత 1574లో యల్లాస్ ఖానుడు అమీలు అయి పూర్వము రెడ్లరాజులు చిన్నకొండమీద కట్టించిన విఘ్నేశ్వరాలయమును పడగొట్టించి ఈ దేవాలయానికి దక్షిణంగా కొంచెం నైరృతి మూలగా యల్లాస్ ఖాను పేట కట్టించి, ఆవూరు గణేశపేట అనికూడ పిలుస్తూ వచ్చిరి. పిమ్మట కుటిఖానుడు అమీను పదవికి వచ్చి 1574నుంచి 1577వరకు మూడు సం॥ పరిపాలించెను. తరువాత జూపల్లె రంగారావుగారి కుమారుడు రంగపతిరావు రాజ్యమునకు వచ్చి ఈ పట్నానికి నైరృతిమూలగా నాదెండ్లకుపోయే మార్గంలో ఈ ఊరి పొలం కొంత తీసికొని అందులో దేవాలయం కట్టించి ఈపట్టణం