పుట:Dhanurvidyaa vilaasamu (1950).pdf/56

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చేసిన తరువాత అన్నదమ్ములైన జంగన్న తిరుపతిరాయనంగార్లు భాగం పంచుకొనుటలో తిరుపతి రాయనంగారి వంతు వచ్చుటవల్ల రాచూరు తాలూకాలో చేరినది. వీరికుమారులైన అప్పారాయనంగారు సీతన్న గార్లు 1208 వరకు పాలించి నిస్సంతువల్ల జంగన్నగారి కుమారులైన భావన్నగారు 3 సం॥ పరిపాలించిన తరువాత 1211 వేలంలో మల్రాజువారికి పోయెను. గుడి కట్టు కుచ్చళ్ల 40

(10) పొత్తూరు సంతుగుంటూరు సర్కారు రాచూరు తాలూకా:- ఉత్తరం సోమేశ్వరస్వామి తూర్పు వేణుగోపాలస్వాములను ప్రతిష్టించిరి. 1182లో పంచుకొనుటలో తిరుపతి రాయన్నాగారివంతులో వచ్చి రాచూరులో చేరినది. గుడి కట్టు 75 మిగతా విషయములు పైదానిమాదరి—

(11) గారపాడుసంతు గుంటూరు సర్కారు రామారు తాలుకా:- ఇది అగ్రహరంగాసాలు 1కి 5వరహాలు ఇచ్చులాగున రమణయ్య మాణిక్యారావువారు ఏర్పాటు చేసి తిరువుల కృష్ణసోమయాజులం గారికి యిచ్చిరి. 1182లో కృష్ణసౌమయాజులంగారు ఈ గ్రామం తూర్పున గంగాధరస్వామిని ప్రతిష్టించి కుం10 మాన్యంను దక్షిణభాగమందు శ్రీఆంజనేయస్వామిని ప్రతిష్టించి కుం10 యిచ్చిరి మిగతది పై దానిమాదిరి. గ్రామం గుడికట్టి 83 పగ్గానికి 1 కి 64 కుంటలు ప్రాప్తి అయిన కుచ్చళ్లు 25

(12) సుద్దపల్లి :—— సంతుగుంటూరు సర్కార్ రాచూరు తాలూకా గ్రామాన ఐదు పశ్చిమమున కాశీ విశ్వేశ్వర స్వామిని మధ్యను వేణుగోపాలస్వామిని దంటు దేవరాయి దీక్షుతులు ప్రతిష్టించి కు2 దానం చేసి అగ్రహార మనుభవించుచుండిరి. ఇది పైవారికి కృష్ణదేవరాయలుచేత యివ్వబడిన అగ్రహారం: మిగతా కథ పైదానిమాదిరి గుడికట్టు, కు 75

కొండవీటికైఫీయతులో మాణిక్యారావువారికి ప్రసక్తమయిన గ్రంథభాగమిది:——ఉడయగిరి, అద్దంకి, వినుకొండ, బెల్లకొండ, నాగార్జునకొండ, తంగేడుకేతవరం మొదలైన దుర్గములు జయించి కొండవీడు వచ్చి అప్పుడు పరిపాలించుచున్న ప్రతాపరుద్రగజపతి కుమారుడు