పుట:Dhanurvidyaa vilaasamu (1950).pdf/52

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తులో చేర్చిరి. అప్పటికి షడ్దర్శనాలవారు ఖిలమైపోగా తిమ్మరాజువారిపరం చేయబడినది. కొండవీటి సీమ వంతుచేసి జమీందార్లుకు పంచిపెట్టేటప్పుడు ఈవంతు ఈగ్రామం రమణయ్య మాణిక్యరావు వంతులో వచ్చి రేపల్లెతాలూకాలో దాఖలు అయినది. 1122 ఫసలీ మొదలు 1126 ఫసలీవరకు పరిపాలించిరి. తరువాత వీరి తమ్ములు వల్లన్నగారు వచ్చి ఈ గ్రామానికి పశ్చిమభాగమందు వనంతోట వేయుంచి శ్రీ వేణుగోపాలస్వామివారికి దానవ్యయం ఒకుకు 070కుభూమి యిచ్చినారు. ఈవల్లన్నగారు సీతన్నగారు గోపన్న గారు 1168 వ ఫసలీవరకు ప్రభుత్వం చేశేరు. 1169 ఫసలీలో సీతన్నగారి కుమారులు జంగన్న మాణిక్యరాయలంగారు చాలధర్మవంతులై రాజ్యము పరిపాలించుచు శ్రీసోమేశ్వరస్వామివారి ఆలయం పునః నిర్మించి కుం 070కు భూమి దానంచేసిరి. మరియు వీరు చేయించిన దానముల వివరం. అయితం వేదావధానులు, రాయప్రోలు సూరంబొట్లు. వట్టెం రామలింగ దీక్షితులు, పోతుకుచ్చి పాపంబొట్లు, నేతి తెలగావధానులు, బూరుగుల నిమ్మంబొట్లుగార్లకు ఒకొక్కరికి కుం 82 చొ॥ దానం చేసిరి. వీరు 1169 నుంచి 1201 ఫసలీవరకు. 33 సం॥ ప్రభుత్వంచేసిరి. 1202 లో వీరికుమారులు భావన్నగారు రాజ్యమునకువచ్చిరి. వీరు కూడ తండ్రివలే దానములు చేయుచూ రాజ్యం పరిపాలించి 1213 ఫసలీవరకు రాజ్యం చేసిరి. ఆర్థికదుస్ధితివల్ల 22 గ్రామాదులు వాసిరెడ్డివారికి అమ్ముటవల్ల పొన్నూరు వగైరాలతో కూడ ఈ గ్రామము వారికి పోయినది, కనుక సదరు 1213 నుంచి వాసిరెడ్డి వెంకటాద్రినాయుడుగారు పరిపాలించిరి. ఈ గ్రామమీకట్టు 36కుచ్చళ్ళలో వనంతోటలు 6టికు వల్లన్నగారుకు 070 యెల్లేపెద్ది సుబ్బన్న 170 ప్రబల పేరుభొట్లు 070 జాస్తే భావన్న 070 చదలవాడ పట్టాభిరాముడు యీచదలవాడ రామన్న చేరి ఒక 070 గ్రామం కవార 070 మాలపల్లి 070 చెర్వులు 3 టికి. యెల్లేపద్ది సుబ్బన్న చెర్వు 070 చడలవారమణప్ప చెర్వు070 కర్ర తిరుపతి 070 - 070 జయనిపాడు డొంకలు 070 చవుడుభూమి 070 యీ యినాములు 070 వెరశి 850 పోను మిగతాది గుడికట్టు.