పుట:Dhanurvidyaa vilaasamu (1950).pdf/51

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


మన్నెకులోద్యాన మధుమాసపైకంబు
                      కామినీమన్మధాకారవేషు
నలిపుణ్యపతిగోత్ర వితతాబ్ధిచంద్రముం
                      డర్థిచాతక వార్షుకాంబుదంబు


గీ.

అని జనుల్ మెచ్చఁ గీర్తిచే నలరి తహహ
చరితదేశాంత సత్కవీశ్వరనితాంత
వర్ణితస్వాంత రేపల్లెపూర్నిశాంత
ధీపితాటోప! వేంకటగోపభూప.

వీ రనేకదేవాలయములకు భూముల నిచ్చిరి. బ్రాహ్మణులకు వసతులు గల్పించిరి.

మాణిక్యారావువారు కల్పించిన దేవబ్రాహ్మణవృత్తులు.

1. పెద్దపూడి :-

ఇది వకసంతు, కూచిపూడి సర్కారు. ముర్త్యుజానగరు తాలూకాలోనిది. ఇది ప్రస్తుతము వాసిరెడ్డివారికి పోయినది.

పూర్వము అరణ్యముగానున్న ఈ స్థలములో ఋషులు సోమేశ్వరస్వామిని, వీరు గోపాలస్వామిని ప్రతిష్టించిరి. 1056 శకంలో గజపతాన్వయులు, గణపతి మహారాజులుగారు పరిపాలించిరి. వీరికి ప్రధానులు గోపరాజురామన్న. గ్రామకరిణీకపు మిరాశీలు వీరు ఏర్పరచుచు, తెలగాణ్యులు, కౌశికగోత్రులై న పుచ్చరాజువారికి సగభాగంగా యిచ్చినారు. 1240 శకం లగాయతు రెడ్డిరాజులు ప్రభుత్వం చేసిరి. వీరికాలములో కొండవీటిసీమ 44 అగ్రహారములు బ్రాహ్మణులకు దానంచేసిరి. వేగినాటివారికి 3 అగ్రహారములు ద్రావిళ్లకు 5 వెలనాటివారికి 36. ఈ గ్రామము వెల్నాటివారిక్రిందకు వచ్చెను. ఈ గ్రామం యెల్లేపద్ది లక్ష్మణదీక్షితులుకు, షడ్దర్మనాల వల్లభసోమయాజులుకు దానం చేసిరి. పైజీర్ణదేవాయములను మరల ప్రతిష్టించి ఏర్పరచినవసతులు కుం 070 శ్రీ సోమేశ్వరస్వామివారికి. కుం 070 గోపాలస్వామివారికి. 1500 శకం వరకు చక్కగాజరిగెను. మహమ్మదీయుల పరిపాలనలో విచ్చిత్తు గలిగినది. కొండవీటిసమతుబందలు చేసేటప్పుడు, ఈ గ్రామం కూచిపూడి సమ