పుట:Dhanurvidyaa vilaasamu (1950).pdf/46

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వర్ణమువారు గా మాఱియుండవచ్చును. అయినను వారు క్షాత్రధర్మమును వీడనాడక వెలయుచునే యున్నారు. తెలుఁగున వెలుమలే ద్రవిడదేశమున 'వెళ్మాన్' అనఁబడు వెళ్లాలవారు నయిరి. అహనానూఱు అను నతిప్రాచీనద్రవిడగ్రంథమున 'వెణ్మాన్ - వెల్మాన్' వెల్మనుగూర్చి పద్య మొకటి కలదు.

"అహ వునర్ పురన్ద అన్బిన్ కడల్ తొడి నఱవు
మహిళ్ ఐరుక్కై నన్నన్ వేళ్మాన్"

వయలై వేలివియలూర్ - 97పాట్టు

పాటలు నేర్చిన వారిని రక్షించేవాఁడు, ప్రేమగలవాఁడు, వదులు కంకణాలుగలవాఁడు, పానీయశాలలుగలవాఁడు, నన్నన్ అని పేరుగలవాఁడునగు, వెణ్మని (వెల్మని) బచ్చలి తీగలవృతి (చెంచ) గల వియలూరు అనుగ్రామము అనిపై నేదోయున్నది. వెళ్మాన్, వెల్మన్, వేళాలన్, వెల్లాళన్ అన్నీ ద్రవిడమునఁ బర్యాయపదములట.[1]

ఐక్ష్వాకులు మొదలగుక్షత్రియు లంధ్రదేశమునకు వచ్చి రాచఱికము నెఱపి, ద్రవిడదేశమునకును వ్యాపించి (శ్రీరంగనాథస్వామి యిక్ష్వాకులనాఁటి కథలు) యుండవచ్చును. తెలుఁగుదేశమున క్షత్రియులు అట్లే వెలుమవారును క్షత్రధర్మముతో తెలుఁగుదేశమున వర్ధిల్లి ద్రవిడదేశమునకును జేరియుండవచ్చును. బసవపురాణమున వెల్మనికథ యొకటి హృద్యమైనది కలదు. అది ద్రవిడ దేశపు శివకవియగు సుందరి మూర్తినాయనారు నాఁటి కథ. అది తెలుఁగున నున్నట్లు గాక ద్రవిడమున పెరియపురాణమునఁ గొంతభేదముతో నున్నది. వెల్మలనుగూర్చి చాటువు.

ఉ.

పైకొనువారితో నొరఁగిపాఱరు, నేరరు భంగసంగతుల్
చేకొనఁబూనికాని దొరఁజేరరు కోరరు దుష్టజంతుర

  1. తిరుపతి శ్రీవెంకటేశ్వర రీసర్చి ఇన్స్టిట్యూట్ లో అరవరీడరుగానున్న శ్రీపళనియప్ప పిళ్ళగా రీవిషయము తెల్పిరి.