పుట:Dhanurvidyaa vilaasamu (1950).pdf/44

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శకుంతలాపరిణయము” శకుంతలాపరిణయ రచనమునకుఁ దర్వాతి రచనముఁ గాబోలును ధనుర్విద్యావిలాసము. ఇందు గద్య మించుక మార్పు చెందినది ‘‘కౌసల్యానందనకటాక్షవీక్షణపరంపరాసమాసాదిత” అని. కాని రెండు గ్రంథములందును గురుస్తుతియుఁ కవి కులగోత్ర ప్రశంసయు నొక్కవిధముననే యున్నవి.

క.

భాసురసూరి గ్రామణి
భూసురముఖ పంకరుహనభోమణి నినమ
ద్దాసనిచయ చింతామణి
నే సింగర గురుశిఖామణిం గణుతింతున్.


మ.

నను రామానుజపాదపద్మయుగళీ నవ్యావ్యయధ్యానపా
వనహృద్భాగగవతావతంసపదసేవాసక్తచిత్తున్ మరు
త్తనయారాధన లబ్ధచారుకవితాధారున్ సదారూఢభా
వను నాస్థానకవిన్ నిజాశ్రితునిఁ బిల్వంబంచి పల్కెం గృపన్.


క.

పాత్రుఁడవై మైత్రేయస
గోత్రుఁడవై నారసింహగురువర్యునకున్
బుత్రుఁడవై వెలయుదు వి
ద్ధాత్రిన్ మాపనుపు సేయఁదగుఁ గృష్ణకవీ!

రెండు గ్రంథములందును పద్యము లున్నవి గావున రెండు నొక్కకవిరచనములే యగుట స్పష్టము ఇవి గాక, ఆంధ్రసాహిత్యపరిషత్తు కేటలాగులోనున్న కొమ్మాలపాటి దండకము, నింకొక యక్షగానము నీతని రచనములని శ్రీనిడదవో లు వెంకటరావుగారు చెప్పిరి. కావచ్చును. పరిషత్తు పుస్తకముల జాబితాలో నాదండకమున కృష్ణమాచార్య రచనమని కలదు. ఆగ్రంథమును నే జదివిచూడలేదు. ఆకాశరావణసంహారమని మరొక పద్యకావ్యము, రసవంతమయినది తెనాలి తాలూకాలోనే మోదుకూ రనువూర మొగసాటి మూర్తిరాజుగారను భట్టు రాజుగారి యింటదొరకినది. నేను మద్రాసు ప్రాచ్యలిఖితపుస్తక