పుట:Dhanurvidyaa vilaasamu (1950).pdf/41

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

విధానము. 19. జాంగలాది భూనిర్ణయప్రకారము. 20. ఏకవింశతివేణువుల చాపదండములుగల రాజులనిర్ణయంబులు. 21. శార్ఞ్గాది చాపలక్షణములు.

పరికరఖండము - ద్వితీయాశ్వాసము

22. శిలీముఖకర్తనము. 23. సెలకట్టియలభేద ముపన్యసించుట. 21. శరోత్పత్తిక్రమము. 25. సెలకట్టియల రాజమార్గంబునంబరచి అందుత్తమసారంబుల సంగ్రహించుట. 26. ధారావక్రంబులు దీర్చువిధము. 27. పుంఖార్హవస్తునిర్దేశము. 28. మయవిశ్వకర్మ సంవాదము. 29. వర్ణభేదవస్తునిర్దేశము. 30. శిల్పవిద్యాచాతుర్యము. 31. శరములకు లక్కగరులు కట్టుమార్గము. 32. ప్రతిపత్రార్హంబులైన పులుగులనామధేయములు. 33. దూరాపాతి, తేజోఘాతి, పాషాణఘాత, లోహఘాతి రచితప్రకారము. 34. అలుకుల రూపప్రకటనము. 35. పంచధారలవలన శరకల్పలప్రకారము, 36. షడ్విధజాతులుంగల కట్టియలకు వినియోగంబు లెఱింగించుట.

పరికరఖండము - తృతీయాశ్వాసము

37. ఉపసాధనములు. 38. గోధాలలామంబులు, కనకశృంగ శిలాచర్మంబుల నిర్మించువిధము. 39. చెకినుల తారతమ్యంబు లేర్పఱించుట 40. ఏకవింశత్యంగుళీత్రాణ నిర్మాణ కౌసలప్రభావము. 41. కనకాంగుళీగుప్తంబు మూసనుబోయువిధము. 42. హేమచర్మ సంయుక్తాంగుళీగోపాయితమార్గము. 43. మయగౌతమసంవాదము. 44. వేణుతూణీరప్రకారము. 45. దారుతూణీరనిర్మాణవిధానము, 46. చర్మనిషంగప్రకారము. 47. కేకీముకురంబులు తరకసులం బొదువు విధము. 48 తరకసుల వినియోగము.

పరికరఖండము - చతుర్థాశ్వాసము

49. గురుస్తవము. 50. భార్గవదత్తమైన గ్రంథప్రకారము. 51. కులమారి పైశాచ కాశ్మిక ఘోరి కుటిలాభిధానంబులు గల ధను