పుట:Dhanurvidyaa vilaasamu (1950).pdf/38

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

లోని విషయములు చాలఁగా జేరియే యున్నవి గాని ఇంక నెన్నో విశేషవిషయములందు గలవు. దానిలోని విషయసూచి యిట్టిది:——

ఆదిఖండము - ప్రథమాశ్వాసము.

1. నిమిభూపాలుఁడు నైమిశారణ్యమున కరుగుట, 2. నీచజనకృతమగు పరిభవము. 3. నారదాగమనము 4. ధనుర్విద్యామహాత్మ్యము. 5. బ్రహ్మయజ్ఞమున నారాయణుఁడు హయగ్రీవుఁడై యవతరించుట. 6. వేదోపవేదములయుత్పత్తి. 7. టిట్టిభబ్రాహ్మణోపాఖ్యానము. 8. నారదుఁడు దివ్యాస్త్రమంత్రములను శపించుట. 9. పారాశర్యస్తవము. 10. భారతకథాప్రకటనము. 11. పరిక్షిత్సంభవము.

ఆదిఖండము - ద్వితీయాశ్వాసము.

12. అర్జునుఁడు పరీక్షిత్తుకు విద్యాభ్యాసమహాత్మ్యమును బోధించుట. 13. అవక్రీతు చరిత్రము. 14. కుమారభార్గవులు సదాశివుని భజించుట. 15. శ క్తి త్రయోత్పత్తి. 15. ధనురాదిసాధనషట్కసంభవము. 17. శక్తిత్రయపూజానిరూపణము. 18. దివ్యాస్త్రసంభవము. 19. ధనుర్విద్యాసాంప్రదాయము. 20. రాజవంశముల క్రమము. 21. భీషణేతిహాసము, 22. నందరాజయుద్ధము. 23. సిద్ధదర్శనము. 24. ఏకాదశమహాధనుర్ధరచరిత్రము. 25. దిండికారకృతవిద్యాలాభము

అభ్యాసఖండము - ప్రథమాశ్వాసము.

1. కృపాచార్యుం డర్జునుని గృహమున కేతెంచుట. 2. అర్జునుఁడు విద్యాలాభమునకై పరీక్షిత్తుని కృపాచార్యుని కప్పగించుట. 3. విద్యారంభపూజావిధానము. 4. షణ్ముఖాదుల సత్యవచనప్రకటనము. 5. గురుశిష్యాభ్యాస రంగలక్షణములు. 6. ముహూర్తప్రకారము. 7. నిబిడాసనవర్తుల ముష్టిలక్షణము. 8. షణ్ముఖలక్షణములు తద్వినియోగములు. 9. ఏకశరాభ్యాసప్రకారము, 10. చతుర్ధశోపాయంబు లెఱింగించుట. 11. వైష్ణవసాచీకృత సన్యాసలక్షణములు. 12. పంచస్థాన