పుట:Dhanurvidyaa vilaasamu (1950).pdf/34

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

15 గతినిర్ణయము 16 లక్ష్యసాదనము 17 ఆకర్షణము 18 దృఢవేధము 19 దూరాపాతము 20 చిత్రవేధము 21 సమరసంభారము.

యుక్తికల్పతరువు చతుష్షష్టికలాసంగ్రహము అభిలషితార్థచింతామణి యనుసంధానగ్రంథములలో ధనుర్వేదవిషయ మత్యల్పమే కలదు.

హరిహర చతురంగమ్

ధనుశ్శాస్త్రప్రకరణమ్

“చతురంగబలం ప్రోక్తం నచ యుద్ధక్రియాక్షమమ్
ధనుర్విద్యాసు నిపుణధానుష్కేణ వినాతతః
ధనుర్వేదం సమాలోచ్య తథై వేశానసంహితామ్
వీరచింతామణిం వీక్ష్య శ్రీకోదండచతుర్ముఖమ్”

“సారసంగ్రహమాలోచ్య ధనుశ్శాస్త్రాంతరాణిచవ వక్షీతత్ర ధనుర్విద్యా సారభూతార్థ సంచయం ధనుఃప్రశంస ధన్విప్రశంస ధనుర్గుణశ్చ బాణశ్చ గురుశ్శిష్యశ్చ పంచమః ధనుర్విద్యాంగ మేతాని కథ్యత్తేక్రమశ స్సహ” చాపద్రవ్యము చాపభేదములు చాపప్రమాణములు చాపదోషములు ధనుఃషడంగములు “అటనీ కర్ణికా శంఖః స్కంధాఃకోట్యంతరేస్థితాః పల్లవోలస్తకో మధ్యేషడంగం ధనురుచ్యతే” షడంగణవివరణము శరద్రవ్యము శరత్రైవిధ్యము తన్మాకము నిందితశరములు శరసప్తాంగములు “ముఖకర్ణి తథా స్కంధౌ గాత్రం వక్త్రానననం తధాజంఘా పుంఖశ్చ విపిజే సప్తంగా న్యనుకల్పయేత్" పుంఖాష్టవిధత్వము పక్షములు పత్రచ్ఛేదము ఫలపాయనము గురుశిష్యులు అనధ్యాయములు శ్రమము గురుపూజాదికము “శుక్రగౌతమ శాండిల్య జమదగ్ని బృహస్పతీ ధనుర్వేద గురూం శ్చాగ్రాన్ తర్పయే ద్బలికర్మణౌ ఉపనయనమ్ పూజా ధనుర్గ్రహణమ్ శ్రమఫల లక్ష్యమ్” లక్ష్యదోషగుణములు స్థానదోషములు స్థానములు సంధానదోషములు