పుట:Dhanurvidyaa vilaasamu (1950).pdf/30

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ద్యాగమములును శివవిష్ణుశక్తిపూజావిధానములును యజ్ఞతంత్రాత్మకముల గావించినవి. భగవద్గీతలలో మఱింత విపులీకరణముతో జ్ఞానతపోయజ్ఞాదికల్పనము లున్నవి.

పైవిధమున భారతమునఁ బేర్కొనబడిన ధనుర్వేదగ్రంథములు గానరావుగాని మునులు క్రమంబున సంక్షిప్తరూపముగాఁ గావించిన గ్రంథము లీక్రిందివి గానవచ్చుచు నవి.

వశిష్టధనుర్వేదసంహిత

“అధైకదా విజగీషు ర్విశ్వామిత్రో రాజర్షి ర్గురుం వశిష్ట మభ్యుపేత్యప్రణ మ్యోవాచ బ్రూహి భగవన్ ధనుర్విద్యాం శ్రోత్రియాయ దృడచేతసే శిష్యాయ దుష్టశత్రువినాశాయచ త మువాచమహర్షి రహ్మర్షి ప్రవరో వశిష్ఠః శ్రుణు భో రాజన్ విశ్వామిత్ర! యాం సరహస్యధనుర్విద్యాం భగవాన్ సదాశివః పరశురామా యోవాచ. తా మేవ సరహస్యాం వచ్మితే హితాయ గోబ్రాహ్మణసాధువేదసంరక్షణాయ చ యజుర్వేదా ధర్వసమ్మితాం సంహితామ్ తత్రచతుష్టయ పాదాత్మకో ధనుర్వేదః యస్య ప్రథమేపాదే దీక్షాప్రకారం ద్వితీయే సంగ్రహః తృతీయే సిద్ధప్రయోగః చతుర్దే ప్రయోగవిధయః ధనుర్వేదవిధి ఆచార్యలక్షణము వేదవిధి చాపప్రమాణము, శుభచాపలక్షణము, వర్జితధనువు గుణలక్షణములు శరలక్షణములు ఫలలక్షణములు, తత్ఫలములు శరోపరిఔషధలేపనము నారాచనాళీకశతఘ్నీవర్ణనములు స్థాన ముష్ట్యా కర్షణలక్షణములు, గుణముష్టి, ధనుర్ముష్టి, సన్ధానము, ధనుర్వ్యాయములు లక్ష్యములు లక్ష్యాభాసము అనధ్యాయములు శ్రమక్రియ లక్ష్యాస్ఖలనవిధి శీఘ్రసంధానము దూరపాతిత్వము దృఢభేదనము హీనగతి సమూహము బాణాలక్ష్యస్ఖలనగతి సమూహము క్షుద్రగతులు దృఢచతుష్కము చిత్రవిధి కాష్ఠచ్ఛేదనము ధావనలక్ష్యము ధావనవిధి, శబ్దవేదిత్వము ప్రత్యాగమనము అస్త్రవిధి అస్త్రములు వానిమంత్రసంస్కారము పాశుపతాస్త్రము ఔషధులు ఔషధవిధి ఉపవాసము