పుట:Dhanurvidyaa vilaasamu (1950).pdf/29

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మించి దాని నభ్యసించుటకు మర్త్యుల కాయుర్బుద్ధులు సాలవని యుమ్మలించి యమ్మహనీయతంత్రంబు సంక్షేపరూపంబునఁ బదివేలధ్యాయంబుల వైశాలాక్షంబన నిర్మించె.

ఆ.

హరునివలనఁ బడసి యాశాస్త్ర మమరేంద్రుఁ
డయిదువేలు సేసె నమరగురుఁడు
తేటపడి నొనర్చెఁ ద్రిసహస్రకాధ్యాయ
రూపసమ్మితముగ భూపవర్య.

దాని శుక్రుండు సహస్రాధ్యాయపరిమితంబు గావించె మఱియు మనుష్యులశక్తి యెఱింగి మునులు క్రమంబున సంక్షిప్తరూపంబులుగా గ్రంథంబులు గావించి రిది నీతిశాస్త్ర ప్రకారంబు” (భారతము శాంతిపర్వము 2. ఆశ్వాసము) మఱియు.

“విష్ణుండు దండనీతిశాస్త్రంబు సకలంబు నాంగిరసున కిచ్చె నాంగిరసుం డింద్రమరీచులకు మరీచి భృగునకు భృగుం డనేకమునులకు నిచ్చె” శాంత్తి 2. ఆశ్వాసమున "ఏయజ్ఞంబులును సంగ్రామయజ్ఞంబునకు సదృశంబులు గావు వినుము వీరమస్తకరాశి వేదికగాఁ గృపాణబాణాదిసాధనంబులు సమిత్సృక్సృవంబులుగా శోణితం బాజ్యంబుగా మాంసంబు పురోడాశంబుగా వీరవ్రతదీక్షితుండు సమరాధ్వరంబు సలిపి రుధిరజలపూరయు మస్తిష్కకర్దమయుఁ గేశశైవాలయు నాంత్రఫేనయు భేరీమండూకయు హేతిమీనయు గజకళేబరపులినయు నగు సమరపుణ్యనది నవభృథస్నానంబు సేసి మదీయలోకంబున సుశ్లోకుండై నిత్యస్థితి నత్యుదాత్తపదవిం బ్రవర్తిల్లుఁ బుణ్యతముం డగుటకుఁ దనువు దొఱంగవలయు నని లేదు తెగువతోడి యనివర్తనగతియ చాలు." (శాంతి 2. ఆశ్వాసము.)

వేదములు ప్రధానముగా యజ్ఞతంత్రప్రతిపాదకములుగా నున్నవి గాన యుపవేదములు గూడఁ దదర్థానుసారముగా గాంధర్వాదివిద్యల యజ్ఞతంత్రాత్మకములనుఁగా సమర్థించినవి. అట్లే శైవవైఘానస శాక్తా