పుట:Dhanurvidyaa vilaasamu (1950).pdf/28

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చున్నది. గాథ యనఁగాఁ బ్రాకృత మాగధీ భాషలలో నార్యావృత్తము వంటిది. ఇది కందపద్యమునందలి రెండవ నాల్గవ పాదముల కొనలో రెండు మూఁడు మాత్రలు తగ్గినట్టి యొకానొక జాతిపద్యము.”

శ్రీ కవిగారు పరుశురామ సూత్రములు శాండిల్యభాష్యముతో గేరళ దేశమునఁ గలవనిరి గాని యవి యుండుట యింతదాఁకఁ దెలియరాలేదు. అగ్నిపురాణమున 249 అధ్యాయముననుండి 252 అధ్యాయముదాక ధనుర్వేదవివరణమున్నది. యుక్తికల్పతరువు, అభిలషితార్థచింతామణి, శివతత్త్వరత్నాకరము, వీరమిత్రోదయము (ఇవిముద్రితములు) చతుష్షష్టికలాసంగ్రహము ననుగ్రంథములలో యుద్ధతంత్రవివరణ మున్నది. యామలాష్టకతంత్రమునఁ గవిగా రుద్ధరించిన విషయసంగ్రహసూచీ మాత్రమున్నదిగాని తద్వివరణములు లేవు. ఇవి గాక వైశంపాయననీతిప్రకాశిక, వసిష్ఠసంహిత, శివధనుర్వేదము, మనుసారము (వ్రాతప్రతి పంజాబు కేటలాగులోనున్నది.) కోదండమండనము, హరిహరచతురంగము, వీరచింతామణి, శివోక్తధనుర్వేదసంహిత, భారతాదులలోని ధనుర్వేదవిషయములు నేఁ జూచిన ముఖ్యగ్రంథములు.

భారతమున:— నానావయవం విరించి—— స్వామ్యసూత్య రాష్ట్రదుర్గకోశసుహృద్బలంబులు, నాన్వీక్షకీత్రయీవార్తాదండనీతులు నరిమిత్రో దాసీనాదిక ద్వాదశరాజమండలంబును సంధి విగ్రహ యానాస సద్విధీభావ సమాశ్రయంబులును మొదలుగా వలయువానికిం బ్రబోధకంబులగు నానావయవంబులుం గలిగి ధర్మార్థకామమోక్షంబులకు సాధకంబు లయి యుండునట్లుగా నూరువేలధ్యాయబులు నఖిలలోకహితంబగు నీతిశాస్త్రంబు రచియించి యిది లోకచరిత్ర నిర్మలీకరణంబునకుఁ గారణం బగునని యనుగ్రహించె, నాలోకపితామహూలలాటంబున ననాది నిధనుండును విశ్వజగత్కర్తయు సర్వభూతాత్ముండును సనాతనుండును నగు విరూపాక్షుండు విశాలాక్షుండను నామంబున నావిర్భవించి యాగ్రంథం బధిగ