పుట:Dhanurvidyaa vilaasamu (1950).pdf/21

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

12


పాదే నిరూపిత మస్తి సర్వేషాం శస్త్రవిశేషాణా మాచాత్యాణాం లక్షణ పూర్వకం సంగ్రహణప్రకారో దర్శితః ద్వితీయే గురు సంప్రదాయ సిద్ధానాం శాస్త్రవిశేషాణాం పునః పునరభ్యాసో మంత్రదేవతా సిద్ధికరణ మపి వక్ష్యతే. తృతీయే పాదే దేవతార్చనాభ్యాసాదిభిః సిద్ధానా మస్త్రవిశేషాణాం ప్రయోగః చతుర్థపాదే యుద్ధప్రకారః క్షత్రియాణాం స్వధర్మప్రవిష్టానాం యుద్ధకర్మనిష్టానాం స్వధర్మాచరణం యుద్ధం. దుష్టదస్యు చౌరాదిభ్యః ప్రజాపాలనం చ ధనుర్వేదస్య ప్రయోజనం, ఏవం బ్రహ్మ రుద్రప్రజాపతి విశ్వామిత్రప్రణీతం ధనుర్వేదశాస్త్రం సురాసురైః పారంపర్యాదవగతం శ్రీపరశురామద్రోణభీష్మాదిభిః ప్రభృతం తచ్చ ధనుర్దీక్షాయాం పార్ధః, ఉత్తమాధికారీ. బాణాసురో, మధ్యమాధికారీ, సాత్యకి ప్రభృతయః సహస్రార్జునో హీనాధికారీ, గురవధాత్ ఇతి ధనుర్ధర ప్రశంసా॥ ఆ ముద్రితములైన గ్రంధములు శ్రీ మానదల్లి రామకృష్ణకవి ఎం. ఏ, గారి దగ్గఱనున్నవి. దానిని జూచియే నే నాయాభాగముల నుదాహరించితిని.

ఈ ధనుర్వేదమును గూర్చి శ్రీ మానవల్లి రామకృష్ణకవి, ఎం. ఏ. గా రిప్పటి కిర్వదియాఱేండ్లకు ముందు గొప్పవ్యాసము ప్రకటించిరి. దానినెల్ల నిక్కడ మరలఁ బ్రకటించి దానిపై విశేషార్థములు వివరింతును.

"ధనుశ్శబ్దము వింటికి రూఢమైనను ముక్తము అముక్తము ముక్తాముక్తము యంత్రముక్తము అను చతుర్విధ ప్రహరణముల వర్తించుచు ధనుర్వేదము శత్రుదండరూపమగు సమస్తప్రయోగసామగ్రీతత్త్వమును బ్రతిపాదించును. ఆది యిరువదివేల శ్లోకములతో నీశానసంహిత యను పేరితో శివునిచేఁ బార్వతి కుపదేశింపఁ బడియె.

అందు

వింశత్సహస్రమానస్తు ధనుర్వేదోపి కీర్తితః
యస్మిన్ నిగద్యతే సర్యలోకతత్త్వం వరాననే
బలాపాదనకాధ్యాయః స్థానాధ్వాయః ప్రమర్దనం