పుట:Devi-Bhaghavathamu.pdf/6

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


శ్రీమత్పరదేవతాయైనమః

శ్రీ

దేవీ భాగవతము

————:x:————

శా. శ్రీయున్ బార్వతియున్ సరస్వతియు స్వశ్రీలేశసంజాత లా
యత్తుల్ హరిరుద్రనీరజభవాద్యాదిత్య సంఘమ్ము లే
మాయాతీతకు నే జగజ్జనని కే మాత్రాస్వరూపాఢ్య కే
ధ్యేయప్రాభవ కట్టి శక్తి సతి భక్తిన్ గొల్తు మిష్టాప్తికిన్. 1

వ. ఇట్లు, 2

ఉ. అంబకు మ్రొక్కి మీఁద జలజాంబకులన్ గొని యాడి యంత హే
రంబుని సన్నుతించి గుణరాసుల మూర్తుల భార్యలన్ గృపా
లంబితచిత్తల దగఁదలంచి యిహమ్ముఁ బరమ్ము నెంచి వం
శంబు తరింపఁజేయ సనిశంబు మనంబునఁ గాంచి యంతటన్. 3