పుట:Desinguraju Katha Ravuru Venkatasubbayya 1889.pdf/5

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శ్రీరస్తు.


విఘ్నేశ్వర స్తుతి.

క ॥ శ్రీకరప్రథమగణాకర | ప్రాకటభవభయవిదూరపన్నగహారా | లోకానుగ్రహకారా | చేకొని రక్షింపుమయ్యశివసుకుమారా ॥.............. *

శ్రీ సుబ్రహ్మణ్య స్తుతి.

క ॥ శరవణభవవరసుందర | కరుణాకర దీనపోష కామితఫలదా | వరశక్తిధారిషణ్ముఖ | సురమునినుతధన్యగణ్యసుబ్రహ్మణ్యా ॥..................*

మహేశ్వర స్తుతి.

క ॥ ఇందుధర సుందరాంగా | కుందేందుచ్ఛవితురంగకుజనవిభంగా | బృందారకహృత్సంగా | మందస్మితవదన బ్రోవుస్మరహరలింగా ॥............*

శ్రీ మహావిష్ణు స్తుతి.

క ॥ కమలాప్త కమలనేత్రా | కమలోద్భవ వినుత పాత్రకర్చురజైత్రా | కమలాప్తకులపవిత్రా | క్రమముగ రక్షించునీలకంధరమిత్రా ॥.............. *

బ్రహ్మదేవుని స్తుతి.

క ॥ నలినోద్బవచతురానన | విలసిత సృష్టిప్రకార వేదివిధాతా | జలజాక్ష నాభిపంకజ | కలి తాంతర్వర్తి దిక్ప్రకాశితకీర్తీ ॥..........