४० దేసింగు రాజు కథ.
అని చెప్పి నమునివరుమాటలు విని యంతనింద్రుడని యెక్
చ నెనుగ దాయాతోండ్రమల్లుడా పనియేమిగనయ్యేజ్
రూఢము గా దెల్పుమునీవనగా ద్రుహిణపుత్రుడనియెజ్
గాఢము భేరీశబ్దముతిమిరికి కడువడివినబడియేజ్ .
(తిమిడికోట శేఖుమహమ్మదుతోండ్రమల్లునిజూచుట.)
తిమిరికోటయేల్ శేఖుమహమ్మదు దిగులు జెంది లేచి క్రమముదప్పీ పరు లెవ్వరొమనపై గదసిరనుచుచూచి మూడు వేలగుఱ్ఱంబులనప్పుడు మోహరంబు జేసి తోడ నెమున్నూర్ పఠాణిరౌతుల తోడు గాను జేసి కత్తికట్టు కాల్బలముల నెల్లను క్రమము గాను నుంచి బ తీసాయుధములు తానప్పుడు భతీజగధరియించి తానొక బా హజారి నెక్కుక దండును గదలించి పూనికతోజనితోండ్రమల్లుని పొందు గానుజూచి ముందుసలాము చేసియునిలిచి యందు సేమమడిగ తొందర సేయగవలవదటంచును తోండ్రమల్లునడిగి మొన్నటివరకునుచాకీరూకల ముడుపంపితినిన్న నిన్నటి లెక్కలుయి వెనన్నిప్పుడు మన్నించగదన్న యిదియును గాకను నా పైతప్పులు యేమియున్నవన్న కదలియిపుడు నాకోట పైకిరా కారణమేమన్న అనీయీ విధముననడు గురుభయమున నడుగులు తడబడను కొనియాడుచుమరి వే డెడితిమిరి కోటమహమ్మదును గజిబిజిమాన్చితోండ్రమల్లుడు గ్రక్కుననిట్ల నెను నిజముగ శేఖుమహమ్మదువచ్చుట నీ పై గాద నేను చెప్పెద వినుము చెంజియేలు దే సింగు రాజుమనకు తప్పక పండెండేండ్ల పైకము నిప్పుడుకట్టుటకు మెండొడ్డియునున్నాడిపుడాతని మేర దెలియ నేడు