దేసింగు రాజు కథ
జనితమతము యేలేటి పరగణా లయిదువత్సరములు
యి నాములిదిగా ననుభ వింపుడని యిమ్మువుత్తరవులు
వెరవుమీద గానిటువలె జెప్పగ సరగున నాతలను
పరువడినట్ల నెచే సెను పాచ్ఛా వహ్వాయనగాను.
దేసింగురాజు తండ్రులనుబిలుచుకొని బారాహజారితోడ చెంజికివచ్చుట.
మరి చేసింగుడుతండ్రులతోను మహమత్ ఖానునితో త్వరలోదమతమగుఱ్ఱము లెక్కియు తరలిరి సేనలతో పదిదినములలో చెంజికి జేరిరి బహు వేడుక గాను మది సంత సమున నూరివారులు మరియు పొగడగాను వచ్చిన బాలునిజూచుచునుఁడి వరుసగనందరును ముచ్చటతో చేసింగునితల్లి ముదము మీరగ నెను ఎత్తిప్రీ తో ముద్దులాడుచును యేమిర నాతనయా చిత్తమెప్పుడునునీ పైనుం డెను చిన్ని నాదుతనయా ఇన్నిది నఁబులు వెచ్చటనుండితి వేమిరసుకు మారా చన్నుల పాలుచే పెనిప్పుడు చయ్యనసుకుమారా అనుచుసుతునకు హారతులెత్తెను అప్పుడు రాంచాయి చనువునద ష్టిదీ సెనప్పుడు సరగున రాంచాయి ఆ దేసింగుడు నందర గూడుక యంతః పురమున మిన్న ఆదర మొప్ప తల్లి చెంతను మోదముతో నున్న యువ రాజుగనా దేసింగునివా గొప్పగ రావించి ప్రవిమలకీతి యె॥ సంగ వెలయుమని పట్టముగట్టించి ఏకొదవలు లేకను వారుండగ నేడోవషణ మున ఆకుమారునితల్లి గతించిన నంతటదుఃఖమున పొగలుచుపరలోక క్రియలెల్ల ను బుధులు మెచ్చగాను తగనొనరించెను చేసింగుండును ధమనీతి గాను