పుట:Delhi-Darbaru.pdf/99

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

76

శ్రీరాజ దంపతులు.


సం చిత్ర లేఖనము నభ్యసించు చుండెను. అతనింజేరి దగురీతి సంభాషించి సంపూర్ణ బధిరుఁ డైనను జక్కఁగ మాట్లాడ నేరువఁ గలిగె ననుటను దెలిసికొనియెనఁట ! 1897 వ సం వత్సరము ఏప్రిలు నెల 25వ తేది 'తల్లిదండ్రుల నలరఁ జేయుచు యార్డు ప్రబ్క్వీ ప్రభువులకుఁ బుత్రికారత్న మొక్కటి జనించెను. ఆ బిడ్డకు విక్టోరియా అలెగ్జాండ్రా ఆలిస్ మేరీయను నామము నిడిరి. జూన్ మాసమునఁ బ్రపంచపు దశ దిశలనుండి గౌరవాను రాగ వాక్యపుష్పముల విక్టోరియా మహా రాజీగారి పీఠమునకుఁ గొని తెచ్చిన యాయమ“ రాజ్యారోహణ షష్టిపూర్తి ' మహోత్సనము జరగెను. అప్పుడీ ప్రభ్వీప్రభ్వు లిరువురును నెల్ల నుద్యోగములకుఁ దోడ్పడి సెయింట: పాల్ దేవాలయ మునకు మహారాణితోఁ గూడఁ గృతజ్ఞతా ప్రార్థన ల్సేయ నేగిరి.

ఐర్లా డు న కు ప్రయాణ ము.

దీనికి తరు వాత ప్రభ్వీ ప్రభువులు ఐర్లాండునకు విజయము సేయుదురను వార్తపర్వెను. ఆ సీమయందలి జను లెల్లరును దమ సంపూర్ణాంగీకారమును గనుపఱచి వీరెప్పుడు వత్తురాయని వేచి యుండిరి. వీరు ఆగస్టు మాసము 17వ తేది లండను నగరము నుండి బయలు దేరిరి. వీరు ఇంగ్లాండు, ఐర్లాండులకు నడుమ నున్న జలభాగము దాఁటు నప్పును దినమంత సుముఖముగ నుండ లేదు. కాని వారుగట్టు చేరిన తరువాత వారికి జనులిచ్చిన స్వాగత మత్యద్భుతము. కొందఱివార్తననుసరించి యట్టి