పుట:Delhi-Darbaru.pdf/91

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

68

శ్రీరా జ దంపతులు.


విషయమును రచియించి యుంచుకొనుము. పిదప నేమియుఁ దొట్రుపాటు పని లేదు. సమయము వచ్చిన వెంటనే ముక్కలు దీసి చదువ వలసిన దె” యని ప్రత్యుత్తర మిచ్చెను, యార్డు ప్రభు నతనికిఁ బ్రణమిల్లెను. కాని యతని బోధనుపయోగింప లేదు. ఒక సభయందు కేంబ్రిడ్జు ప్రభువు ప్రక్కనఁ గూర్చొని యుం డెను, తానగ్రాసనాసీనుఁడై యుండె. అట్టి తగుణమున జార్జి ప్రభువు లేచి కేంబ్రిడ్జు ప్రభువు విస్మయమందు చుండఁ దన మనో పేటిక నుండి వెలువడు వాక్కులతో నల్ల నల్లన నుపన్యసింప మొదలి డెను. కేంబ్రిడ్జు “పొగరుపోతు కుఱ్ఱఁడు. నేఁ జెప్పిన ట్లేల జెయ్య- డయ్యె ? తప్పదు. ఇతఁడుపన్యాసమధ్యమున నాఁగిపోవును. అవ మానపడును” అని గొణఁగుకొను చుండెను. యూర్కు భీతినంద లేదు. నిలువ లేదు. రెండుమూఁడుపన్యాసముల జయప్రదముగఁ జేసి తండ్రికి సంతోషము నించెను.

వి వా హ మ హెూ త్స వ ము.

1893 వ సంవత్సరము మే నెల 3 వ దినమున యార్కు ప్రభువుకును మేరా కొమరి తెకును ప్రధానము జరగె ననువార్త వ్యాపించెను. దేశమంతయును మిక్కిలి యానందించె. పత్రికలా యానందమును వేనోళ్లఁ జూటెను. శీఘ్రకాలము లోననె యిరు వారులవారును నపరిమితమగు పెండ్లి సన్నాహములఁ జేయఁ దొడంగిరి. సామ్రాజ్యపుఁ బది చెరగుల నుండియు బహుమాన ములు పెండ్లి కోమారుఁడు . పెండ్లి కోమార్తెలకు వేన వేలుగ