పుట:Delhi-Darbaru.pdf/90

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

జార్జి యార్కుప్రభువగుట.

67


సించుచుండును. ఇట్లు కొంత కాలమట గడపి జార్జి మెలంపసు' అను రెండవతరగతి నావ కధ్యక్షుఁడయి నావికా ప్రదర్శనములఁ బని చేసెను. ఇంచుమించుగ నీసమయమున నె జార్జికి 'యార్కు ప్రభువు' అను బిరుదుగలిగెను. సింహాసనమున కర్షఁడై నందున నీతనికి నావికాజీననము విడువదగినదేయైనను గొంతకాలము వఱకును నప్పుడప్పుడు సముద్రయానమునకుఁ బోవుటకువలయు సదుపాయము లేర్పఱుపఁబడెను. ప్రభుమండల మధ్యమున కంటే వీచికాసమూహమధ్య ముననే యితనికి దృష్టి యెక్కుడగుటచే యున రాజపట్టభద్రున కోసంగఁబడు పెక్కు బిరుదావళులును దదర్థమునియమితములయిన యాచారములును నితని కంతగా రుచింప లేదు. కాని యవ్వానిని స్వీకరించియే తీరవలసిన వాఁ డగుట, నాని నెల్లను నర్థాంగీకారముతోడ సందు కొనియెను' క్రీ|| శ|| 1892 వ సంవత్సరము జూన్ నెల 17 వ తేది యితఁడు ప్రభువుల సభలో నొక సభ్యుఁడుగ నేర్పడి యా పదమునకు నిర్ణీతమగుఁ బ్రతినల నంగీక రించెను. ఉపన్యాసము లిచ్చుట యనిన నావికులకు తలకంటగింపు. నావికుఁ డగుట చే నితనికిని ఉపన్యాసముల యుదంత యభిరుచి లేదు. లేకున్నను ఉపన్యా సము లియ్యక తప్పినది కాదు. కావున ఇతఁడు దన బంధువగు కేఁ బ్రిడ్డు ప్రభువును ఉపన్యాసములిచ్చు విధమునుగూర్చి కొన్ని సలహా లిమ్మని యడిగెను. అతఁడు “కుర్రా! ఇంతకంటే సులభ మేమియు లేదు. చిన్న కాగితపు ముక్కలమీఁద నీవు మాట్లాడు