పుట:Delhi-Darbaru.pdf/75

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వీ ధు లు.

51


నారా తోటయును యమునానది తీరమునంగల కుద్సియా తోటయును ముఖ్యములు.

వీధు లు.

ఢిల్లీయందు పెద్దవీధులు పది గలవు. వీనిని నైర్మల్యము న నేమి,. ప్రకాశమున నేని, సౌకర్యమున నేని, వై శాల్యమున నేమి మించువీధులు గల పురము భరతవర్షమున మఱొక్కటి లేదు. ఇందు ముఖ్యము చాందిని చౌకు. చాందిని చౌకు అనగా రజత వీధియని యర్థము. ఇది కోటలోనుండి లాహోరు ద్వారమునకు 1 మైలు వ్యాపించుచున్నది. దీని వెడలుపు 74 అడుగులు. దీని మధ్య ప్రదేశమున నుండు కొంచె మెత్తగు బాటకు రెండు వైపులను వృక్ష పంక్తులు పాంధులకు జల్లనినీడ నీనఁ గంకణము గట్టి నిలుచొని యున్నవి.

దర్బారునీధి యనునది ఢిల్లీ రాజ మార్గమునుండి పోవు చీలిక లలో నొక్కటి. దీని కుత్తర భాగమున నె బవారిమైదానము గలదు. ఈ బవారి మైదానమె దర్బారు రంగము. ఇది కాశ్మీర ద్వారమునుండి 34 మైళ్లున్నది. ఇచ్చటనే 1977వ సంవత్సర మందు విక్టోరియా మహారాష్ట్ర కాలమున లిట్టను ప్రభువును, 1903 న సంవత్సరమున సప్తమైడ్వర్డు చక్రవర్తి గారి ప్రతినిధిగ లార్డు కర్జనును. దర్బారుల నడిపిరి. ఇచ్చట నే కడచిన ' డిశం బరు మాసము పండ్రెండవ తేది మంగళ వారమున సర్వ సామంత ప్రభువులును ప్రజలును నేత్రపర్వముగాఁ జూచుచుండ