పుట:Delhi-Darbaru.pdf/71

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అశోకుని శిలాస్తూపము.

47



పై కెక్కింపఁబడి ఫిరోజాబాదుకుఁ గొనిపోఁబడెను. అచ్చట నెంతో ప్రయాసతో నిద్దానిని నగరుఁ జేర్చిరి " *[1]

ఇది నగరు చేరిన పిదప దీనిని నిలుపుట కొనర్చిన పరి శ్రమ గూడవర్ణ నీయమే. ఢిల్లీయందలి చతురులగు పని వా రెల్లరును జేరి మిక్కిలి జాగరూకతతో విచారించి యొక యుపా యమును బన్నిరి. సున్నముతోను గార తోడను నొకకట్టడ మును గట్టి యొక్కొక యంతస్థు ముగియుటతోడనే ఆయంత స్థు పై కీ స్తూపపుఁ జివర నెక్కించుచువచ్చిరి. ఇట్లెక్కింప నెక్కింప నొక యెత్తేర్పడెను. తరువాత స్తూపమును సమ రేఖాకృతిగ నిలువఁ బెట్టు టకుఁ గొన్ని యంత్రములు పన్ని మిక్కిలి శ్రమ చేసి కార్యము సాధించిరి.

ఈ స్తూపము 37 అనుగల ఎత్తుగలదు. పీఠ భాగమునఁ జుట్టు కొలత 9 అడుగుల 4 అంగుళములు. దీనిపై చెక్కఁబడిన య శోకుని నాలుగు శాసనములును చెక్కు చెదరకున్న వి. ఇవియే భరతఖండ చరిత్రమున నిలిచియున్న శాసనములలో బ్రాచీన తమములు(క్రీ! పూ. మూఁడవశతాబ్దము). క్రీ! శ | 1164 సంవత్సరమున చౌహణ్ రాజగు నీసల దేవునిచే రచియిం పఁబడిన శాసన, బొండుగూడ దీని నలంకరించుచున్నది. ఇంకను ఢిల్లీయంద నేక ప్రేక్షణీయ విషయములు గలవు గాని యవి యెల్లయు వర్ణించుట కిచ్చట తావుచాలదు. .............................................................................................

  • "ఫెర్గుసను గారి కొన్ని వాక్యములకు భాషాంతరీకరణము.