పుట:Delhi-Darbaru.pdf/69

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అశోకుని శిలాస్తూపము.

45


పుట్టెను. బూరుగుప్రత్తి బస్తాలుబస్తాలుగ వచ్చి చేరుటకుఁ దగు నేర్పాటు లొనర్పఁబడెను. స్తూపమునకుఁ జుట్టును గొల్లలుగ నీప్రత్తిపఱచి వైచిరి. స్తూపము గ్రింది భాగములోని మట్టిని దీయుటతో నది యల్లనల్ల నదనకొఱ కేర్పడిన మెత్తపయిఁ బడెను. ప్రత్తికొంచెము కొంచెముగఁ దీసి వేయఁబడెను.. స్తూపము భూమిపై సురక్షితముగఁ బడియుండెను. త్రవ్విన భాగమును బరీక్షిం షఁగా నొక పెద్ద చదరపురాయి దీని కాధా రముగా నిడియుంట దెలిసెను. దీనినిగూడ పెకలించి దీసిరి.. స్తూపమునకు దెబ్బ దాకకుండుటకయి దాని కావరణముగ మెత్తని తుంగగడ్డియు తోళ్లును వైచి కట్టిరి. నలుబది రెండు చక్రములతో నొక బండి సిద్ధమా యెను. ప్రతిచక్రమునకును నొక్కొక్క- తాడు కట్టియుంచిరి. ఒక్కొక్క త్రాటికడను వేల కొలఁది జనులు పనిచేసి మిక్కిలికష్టముతో నాస్తూపమును శక టముమీఁది కెక్కించిరి. తరువాత గానుకు గానుకు నొక్కొక్క మోకును బంధించి, మో కొక్కింటిని నూరుగురుజనులు పట్టి లాగి, యీ బండిని యమునానదీతీరమునకుఁ దెచ్చి విడిచిరి. సు ల్తానుగా రీస్తూపము సాగుటను వీక్షింప నటకే తెంచిరి. అదివఱకే 2000 మణుగుల బరువునకుఁ దక్కువగాక 5000 ను 7000 ను మోయఁగలుగు గొప్ప పడవల నేకములు యమునా నదియందు బారుగాఁగట్టియుండెను.మహాచాతుర్యముతో స్తూపమాపడవలు