పుట:Delhi-Darbaru.pdf/56

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

32

ఢిల్లీ న గ ర చ ి త్రము.


అడుగుల పొడవుగలది. ఇందున సగము వెడలుపు. అంతర్భాగమం దలి విడిస్థలము 142 అడుగుల నిడుపును 108 అడుగుల వెడ లుపునుగలది. ఉత్తర ద్వారమును బూర్వ ద్వారమును నిప్పటికిని మంచిస్థితియం దున్నవి. అచ్చటనె ఈకట్టడపు జన్మ చరిత్రం గెలుపు శాసనములు గనుపట్టుచున్నవి. ఇది మొట్ట మొదట హిందువుల దేవాలయముగ నుండెననుట నిర్వివాదాంశము. ఇది పృథ్వీరాజు దేవాలయమని ప్రతీతి. పఠానులు ఢిల్లీ నగరమును స్వాధీనపఱచుకొనిన తరువాత కుత్ బుద్దీను, అతనికి వెనుక అల్తమషు, అతనికిఁ బిదప నల్లాయుద్దీను ఈ మసీదును గ్రమక్రమ ముగఁ బూర్తిచేసినట్లు అగుపించుచున్నది. దేవాలయమును మసీదు సేయుటలో మహమదీయులు దమ మత సిద్ధాంతములకు విరుద్ధమని తోఁచిన విగ్రహములను గొన్నిటిని బూర్ణముగఁ బగులగొట్టిరి. మరికొన్నిటిని గానరాకుండఁ జేయు తలంపు: నాయభాగముల పదట్టమగు సున్నము పూతఁబూసిరి. కాల క్రమమున నా పూత చెదరిపోయి ప్రథమమున మహమ్మదీయులు హిందూ 'దేశమును బ్రవేశించునాటికి హైందవశిల్పకలా చాతుర్య మెంత యౌన్నత్య దశయందుండె ననుటను స్పష్టముగ బోధించు విగ్రహాదులు బయల్పడినవి. స్తంభములపై నిప్పటి అని చూడనగు చిత్రస్వరూపములు గన్నులపండు వొనర్ప- గలవు. ఒక్కెడఁ బక్ష ఫలపుష్పములతో వేగు లతామతల్లికలు గుబురులు గుబురులుగ సుంద రపాత్రముల నుండి వెలువడి